Rajasthan Royals Adam Zampa pulls out of IPL 2024: గాయాలు జట్లను వేధిస్తున్నాయి. ఇప్పటికే షమీ(Shammi) సహా కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం అవ్వగా తాజాగా...రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టుకు పెద్ద షాక్  తగిలింది.  రాజస్థాన్ పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ(Prasidh Krishna) ఈ సీజన్‌  మొత్తానికి దూరమయ్యాడు. తాజాగా ఆ జట్టు స్పిన్నర్‌ఆడమ్‌ జంపా(Adam Zampa) లీగ్‌ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో జంపా ఈ నిర్ణయం తీసుకున్నాడు. బిజీ షెడ్యూల్‌ కారణంగా జంపా ఐపీఎల్‌ ఆడకూడదని నిర్ణయం తీసుకున్నాడు. 


యుజ్వేంద్ర చాహల్‌, రవి చంద్రన్‌ అశ్విన్‌, ఆడమ్‌ జంపాలతో కూడిన రాజస్థాన్‌ రాయల్స్‌ స్పిన్‌ విభాగంగా చాలా పటిష్టంగా ఉండేది.. ఇప్పుడు జంపా దూరం కావడం ఆ జట్టును ఆందోళన పరుస్తోంది.  అనూహ్యంగా టోర్నీ ప్రారంభానికి ఒక్క రోజు ముందు జంపా ఈ నిర్ణయం తీసుకోవడం కలకలం రేపుతోంది. దీంతో రాజస్థాన్‌ రాయల్స్‌ స్పిన్‌ విభాగం బలహీనంగా మారింది. ఆడమ్‌ జంపా స్థానంలో ముంబై ఆఫ్‌ స్పిన్నర్‌ తనుష్‌ కోటియన్‌ జట్టులో చేరాడు. అలాగే రోడ్డు ప్రమాదంలో గాయపడిన గుజరాత్‌ వికెట్‌ కీపర్‌ రాబిన్‌ మింజ్‌ స్థానంలో బీఆర్‌ శరత్‌ను తీసుకున్నారు. . 25 ఏళ్ల తనుశ్ 26 ఫస్ట్ క్లాస్ మ్యాచులు, 19 లిస్ట్-ఏ మ్యాచులు, 23 టీ200లు ఆడాడు. అతడు 119 వికెట్లు, 1300లకు పైగా పరుగులు చేశాడు. గత ఐపీఎల్ సీజన్ లో ఆరు మ్యాచులు ఆడిన జంపా ఎనిమిది వికెట్లు తీశాడు.


ఇండియ‌న్ ప్రీమియ‌ర్‌లీగ్ ఇప్పుడు వేరే లెవెల్ 


ఇన్నాళ్ల క్రికెట్ ఒకెత్తు...ఇప్పుడో ఎత్తు. కోట్ల‌మంది క్రికెట్ అభిమానులను అల‌రించేందుకు, మండువేస‌విలో ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్టైన్‌మెంట్ అందించేందుకు మ‌న ముందుకొచ్చేసింది ఇండియ‌న్ ప్రీమియ‌ర్‌లీగ్ 2024. అభిమాన ఆట‌గాళ్ల జెర్సీలు మారిపోయాయి. టీంలు మారిపోయాయి. ఇక అల్లంత దూరాన ఉన్న ఆ టెటిల్ కోసం ఆయా వేట‌గాళ్ల ఆట మాత్ర‌మే మిగిలింది. ముఖ్యంగా ఐపీయ‌ల్ అంటే చెల‌రేగిపోయే ఇండియ‌న్ క్రికెట‌ర్లు ఈసారి ఎలాంటి ఆట‌తీరు క‌న‌బ‌రుస్తారో అని కోట్ల‌ క‌ళ్లు ఎదురుచూస్తున్నాయి. ఒక్క టైటిల్ కోసం ఇంకా కొన్ని జ‌ట్టు వేట కొన‌సాగిస్తుంటే, ఆ క‌ల తీర్చుకొని ఆ జ‌ట్ల‌ను కొత్త నాయ‌క‌త్వంలో ఆడిస్తున్న జ‌ట్లు మ‌రికొన్ని. ఇలా బ్యాటింగ్ విజృంభ‌ణలు, బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌లు, క‌ళ్లుచెదిరే ఫీల్డింగ్ విన్యాసాల‌తో మ‌న ముందుకొచ్చింది ఐపీయ‌ల్‌2024.


మ‌హేంద్ర‌సింగ్ ధోనీ (MS Dhoni)కి ఇదే  చివ‌రి ఐపీయ‌ల్  అన్న అనుమానాల‌కు తోడుగా చాలా కూల్‌గా త‌న కెప్టెన్సీ వ‌దిలేసి మ‌రింత షాక్ కి గురిచేశాడు త‌లైవా.  దీంతో  ఈ సారి అంద‌రి క‌ళ్లు ముందు వెతుకుతోంది ధోనీ గురించే. రోహిత్ ను కెప్టెన్సీ నుంచి ప‌క్క‌న పెట్టి నెలలు గడిచినా ఆ వేడి తగ్గలేదు. అయితే ప్రాక్టీస్‌లో అంద‌రితో క‌లిసి పాల్గొన‌డం, హార్ధిక్‌తో మామూలుగానే ఉండటం రోహిత్ మీద ఈ ఎఫెక్ట్ ఏమీలేద‌ని న‌మ్ముతున్నారు అభిమానులు. కానీ మ్యాచ్ లు జ‌రిగే కొద్దీ ఎలా ఉంటుంద‌నేది కొంచెం ఆస‌క్తిక‌ర అంశంగా చెప్పొచ్చు. అలాగే బెంగ‌ళూరు అమ్మాయిలు విమెన్ టైటిల్ సాధించ‌డం, ఈ సారి ఎలాగైనా క‌ప్ కొడ‌తాం అందుకు ఏం చేయాలో అంతా చేస్తాం అన్న విరాట్(Virat Kohli),  మాట‌ల‌తో, అందరి దృష్టీ విరాట్‌తో పాటు ఆర్సీబీ మీద కూడా ఉంటాయ‌న‌డంలో సందేహంలేదు. ఇక గ‌తేడాది రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి కోలుకొని ఈ ఐపీయ‌ల్‌కి అందుబాటులోకొచ్చిన రిష‌బ్‌పంత్(Rishabh Pant) ఈ సారి ఎట్రాక్ష‌న్ ప్లేయ‌ర్‌.