Players with most wickets for Mumbai Indians in IPL: ఈ ఐపీఎల్(IPL)లో ముంబై ఇండియన్స్(MI) ప్రయాణం... ప్రతికూల ఫలితాలతో ప్రారంభమైంది. అయిదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians) తొలి విజయం నమోదు చేసింది. ఎంత వరుసగా విఫలమవుతున్నా గత మ్యాచ్‌లో విజయం సాధించి ఈ ఐపీఎల్‌లో తొలి విజయం నమోదు చేసింది. దాన్ని కొనసాగించాలని పట్టుదలగా ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఎదుర్కోవడానికి ముందు తడబడుతున్న RCBపై గెలిచి ఆత్మ విశ్వాసాన్ని పోగు చేసుకోవాలని ముంబై చూస్తోంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ రాణిస్తున్నా మిడిల్ ఆర్డర్‌లో ముంబై బ్యాటర్లు మెరవడం లేదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నుంచి భారీ ఇన్నింగ్స్ ఇంకా బాకీగానే ఉంది. యం తర్వాత జట్టులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తొలి మ్యాచ్‌లో నిరాశపరిచాడు. రొమారియో షెపర్డ్ ఒక ఓవర్‌లో 32 పరుగులు చేసి తాను ఎంత విధ్వంసకర బ్యాటర్‌నో ఇప్పటికే ప్రత్యర్థి జట్లకు తేల్చి చెప్పాడు. ఈ నేపధ్యంలో ముంబై ఇండియన్స్ తరపున ఇప్పటివరకూ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లు ఎవరరో చూద్దాం.
లసిత్ మలింగ:
దిగ్గజ పేసర్ లసిత్ మలింగ(Lasith Malinga) ముంబై తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. మలింగ మొత్తం 122 మ్యాచ్‌ల్లో 170 వికెట్లు తీసి ఈ లిస్ట్ లో అగ్రస్థానంలో ఉన్నాడు. లసిత్ మలింగ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 5/13.
జస్ప్రీత్ బుమ్రా:
జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ముంబై ఇండియన్స్ తరపున 1ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ఆడి 150 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు.
హర్భజన్ సింగ్:
హర్భజన్ సింగ్ (Harbhajan Singh )127 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
మెక్‌క్లెన్‌గెనాన్
మిచ్ మెక్‌గ్లెనాన్(Mitchell McClenaghan) ముంబై తరపున ఆడుతూ 71 వికెట్లు తీసుకుని నాలుగో స్థానంలో నిలిచాడు.
కీరన్ పొలార్డ్
ముంబైకు అనేక మ్యాచుల్లో ఒంటి చేత్తో విజయాలు అందించిన కీరన్ పొలార్డ్ (Kieron Pollard) ఈ జాబితాలో అయిదో స్థానంలో ఉన్నాడు. ఈ స్టార్ ఆల్ రౌండర్ ముంబై తరపున ఆడుతూ 69 వికెట్లు తీశాడు.
ముంబైకి విజయం అవసరమే
ఇక ఈ రోజు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై(MI)తో బెంగళూరు(RCB) అమీతుమీ తేల్చుకోనుంది. అందులోనూ ముంబైకు ఈ మ్యాచు చాలా కీలకంగా మారింది. అయితే ప్రస్తుత పరిస్థితులు ముంబైకే అనుకూలంగా ఉన్నాయి. ఈ ఐపీఎల్‌లో తొలి విజయాన్ని నమోదు చేసిన ముంబై దాన్ని కొనసాగించాలని పట్టుదలగా ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఎదుర్కోవడానికి ముందు తడబడుతున్న RCBపై గెలిచి ఆత్మ విశ్వాసాన్ని పోగు చేసుకోవాలని ముంబై చూస్తోంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ రాణిస్తున్నా మిడిల్ ఆర్డర్‌లో ముంబై బ్యాటర్లు మెరవడం లేదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నుంచి భారీ ఇన్నింగ్స్ ఇంకా బాకీగానే ఉంది. గాయం తర్వాత జట్టులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తొలి మ్యాచ్‌లో నిరాశపరిచాడు. రొమారియో షెపర్డ్ ఒక ఓవర్‌లో 32 పరుగులు చేసి తాను ఎంత విధ్వంసకర బ్యాటర్‌నో ఇప్పటికే ప్రత్యర్థి జట్లకు తేల్చి చెప్పాడు. సూర్య, షెపర్డ్ బ్యాట్‌కు పని చెప్తే బెంగళూరుపై గెలుపు ముంబైకి కష్టమేమీ కాదు.