Difficult To Describe Surya Kumar Yadav On Dealing With Recent Injuries: ముంబై ఇండియ‌న్(MI) బ్యాట‌ర్ సూర్యకుమార్ యాద‌వ్‌(Surya Kumar yadav) గాయంతో కొన్నాళ్లపాటు పోరాడాడు. చాన్నాళ్ల తర్వాత ఢిల్లీ(DC) తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగిన సూర్య.. ఒక్క పరుగు చేయకుండానే పెవిలియన్‌ చేరాడు. అయితే తన గాయాలపై సూర్య ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. మూడు నెల‌ల నుంచి మూడు ర‌కాల గాయాల‌తో ఇబ్బందిప‌డిన‌ట్లు సూర్యకుమార్ యాద‌వ్ తెలిపాడు. ఐపీఎల్ పోస్టు చేసిన వీడియోలో అత‌ను ఈ విష‌యాన్ని చెప్పాడు. స్పోర్ట్స్‌ హెర్నియా, చీలమండ, కుడి మోకాలి గాయాలతో తాను పోరాడినట్లు సూర్యా భాయ్‌ వెల్లడించాడు. ఒక్కో గాయం నుంచి బయటపడుతూ ఇక్కడికి చేరుకున్నానన్నాడు. తన జీవితంలో ఎప్పుడూ పుస్తకం చదవలేదని కానీ గాయాల కారణంగా ఆ పని కూడా ప్రారంభించానని సూర్యా తెలిపాడు. ఉదయాన్నే నిద్రలేచి కసరత్తులు చేశానని...తాను వేగంగా కోలుకునేందుకు అన్నీ దోహదపడ్డాయని సూర్య వివరించాడు. త‌న ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకునేందుకు చాలా కృషి చేసిన‌ట్లు చెప్పాడు. రిక‌వ‌రీ ప్రాసెస్ చాలా బోరింగ్‌గా సాగింద‌న్నాడు. 


నిరాశ పరిచిన సూర్య
ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)తో జరిగిన మ్యాచ్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌(Suryakumar yadav )రెండో బంతికే అవుటై నిరాశ పరిచాడు. ఎన్నో అంచనాల మధ్య వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన సూర్యకుమార్‌ యాదవ్‌... నోకియా బౌలింగ్‌లో ఫ్రేజర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. రెండు బంతులు ఎదుర్కొన్న సూర్య ఒక్క పరుగు కూడా చేయకుండా అవుటయ్యాడు. 


ఆపరేషన్ అనంతరం...
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఫీల్డింగ్‌ చేస్తుండగా సూర్య కాలు మెలిక పడింది. చీలమండలో చీలిక వచ్చినట్లు కోలుకోవడానికి వారాలు పట్టనున్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో సూర్యకుమార్‌ యాదవ్‌ దాదాపు రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరం అయ్యాడు గాయం కారణంగా జనవరి 11న స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో ఆరంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌కు సూర్య భాయ్‌ అందుబాటులో లేదు. జాతీయ క్రికెట్‌ అకాడమీలో సూర్య కోలుకున్నాడు.


సూర్య విధ్వంసం...
ఐసీసీ(ICC) ఏటా అందించే ప్రతిష్ఠాత్మక‌ టీ20 క్రికెట‌ర్ ఆఫ్ ఇది ఇయ‌ర్ 2023(T20 Cricketer of the Year Award 2023) అవార్డును టీమిండియా(Team India) విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌(Surya kumar Yadav) గెలుచుకున్నాడు. మెన్స్‌ టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డుగా నిలిచి పొట్టి క్రికెట్‌లో తన మార్క్‌ చాటాడు. టీ 20లో ప్రపంచ నెంబర్‌ వన్‌ ఆటగాడు సూర్యకుమార్ యాద‌వ్... జింబాబ్వే సార‌థి సికింద‌ర్ ర‌జా, న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్‌ మార్క్ చాప్‌మ‌న్, ఉగాండా సంచ‌ల‌నం అల్పేష్ ర‌మ్జానీ ఈ అవార్డు కోసం పోటీ పడ్డారు. కానీ చివరికి ఈ అవార్డు సూర్య భాయ్‌నే వరించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ 2023లో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. స‌ఫారీ గడ్డపై తాజాగా సెంచ‌రీతో ఈ ఫార్మాట్‌లో నాలుగో శ‌త‌కం ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది మొత్తం 17 ఇన్నింగ్స్‌ల్లో సూర్యా భాయ్‌ 155.95 స్ట్రైక్ రేటుతో 733 ర‌న్స్ కొట్టాడు.