ఎవరీ నితీశ్ కుమార్
20 ఏళ్ల నితీష్‌కుమార్ 2003లో వైజాగ్‌లో జన్మించాడు. నితీశ్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి, హిందుస్తాన్ జింక్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు. నితీష్ 14 ఏళ్ల వయస్సులోనే విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆంధ్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో 176.41 యావరేజ్‌తో 1237 పరుగులు, బౌలింగ్‌లో 26 వికెట్లు తీశాడు. బీసీసీఐ నుంచి 2017-18 ఏడాదికి గాను ‘బెస్ట్ క్రికెటర్ ఇన్ ది అండర్16’ జగన్మోహియా దాల్మియా అవార్డు గెలుచుకున్నాడు. 2020 రంజీ ట్రోఫీ సీజన్‌లో ఆంధ్ర జట్టు తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అనంతరం 2021లో లిస్ట్-ఏ క్రికెట్ అరంగేట్రం చేశాడు. అదే ఏడాది టీ20ల్లో కూడా నితీష్ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 17 మ్యాచ్‌లు ఆడిన నితీశ్ రెడ్డి.. 566 పరుగులతో పాటు 52 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో 403 పరుగులతో పాటు 14 వికెట్లు సాధించారు. దేశీవాళీ క్రికెట్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో నితీశ్ రెడ్డిని ఐపీఎల్ 2023 వేలంలో రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. గతేడాది సీజన్‌లో ఆర్సీబీతో మ్యాచ్‌లో నితీష్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. కాగా ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ నాలుగో ఆంధ్రా క్రికెటర్‌గా నితీశ్ రెడ్డి నిలిచాడు. ఇంతకుముందు వేణుగోపాల రావు, అంబటి రాయుడు, శ్రీకర్ భరత్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు.
IPL 2024: తెలుగోడా మజాకా, ఎవరీ నితీశ్‌కుమార్ రెడ్డి
ABP Desam
Updated at:
10 Apr 2024 08:00 AM (IST)
Edited By: Jyotsna
Nitish Reddy: పంజాబ్ కింగ్స్‌తో చివరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్ విజయంలో తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు.
హైదరాబాద్ మ్యాచ్ లో మెరిసిన తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ ( Image Source : Twitter )
NEXT
PREV
Nitish Reddy's all-round show: పంజాబ్ కింగ్స్(PBKS)తో చివరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయంలో తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. మిగిలిన బ్యాటర్లు పరుగులు చేయడానికే ఇబ్బంది పడుతున్న వేళ... పరుగులు రావడమే గగనమైపోయిన సమయాన... నితీశ్‌కుమార్ అద్భుతమే చేశాడు. 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన నితీష్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తొలుత ఆచితూచి ఆడిన నితీష్.. క్రీజులో కాస్త సెట్ అయ్యాక భీబత్సం సృష్టించాడు. పటిష్టమైన పంజాబ్ బౌలర్లు సమర్థంగా ఎదుర్కొంటూ సునాయసంగా సిక్సర్లు బాదేశాడు. రబాడ బౌలింగ్‌లో కొట్టిన హుక్ షాట్ సిక్సయితే చూసేందుకు రెండు కళ్లు సరిపోలేదు. హైదరాబాద్ స్కోరు అసలు 130 అయినా దాటుతుందా అనిపించిన సమయంలో తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ తన ఆటతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఐపీఎల్‌లో నితీశ్ తొలి అర్ధ శతకం నమోదు చేశాడు. హర్ ప్రీత్ బార్ వేసిన ఓవర్‌లో రెండు సిక్సులు, రెండు ఫోర్లు బాదిన నితీశ్... 32 బంతుల్లోనే అర్థ శతకం మార్క్ అందుకున్నాడు. మొత్తంగా 37 బంతులు ఎదుర్కొన్న నితీశ్‌కుమార్... 4 ఫోర్లు.. అయిదు సిక్సర్లతో 64 పరుగులు చేయడంతోపాటు బౌలింగ్‌లో కూడా నితీష్ ఓ వికెట్ పడగొట్టడంతో హైదరాబాద్ భారీ స్కోరు చేసి విజయం సాధించగలిగింది.
Published at:
10 Apr 2024 08:00 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -