PBKS vs RR IPL 2024 Rajasthan target 148: ఐపీఎల్(IPL) పంజాబ్(PBKS)తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(RR) బౌలర్లు రాణించారు. పంజాబ్‌ను తక్కువ పరుగులకే పరిమితం చేశారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై రాజస్థాన్ బౌలర్లు సమర్థంగా రాణించారు. రాజస్థాన్ బౌలర్ల ధాటికి పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ బ్యాటర్లలో ఒక్కరే 30 పరుగుల మార్క్‌ను దాటారు. పంజాబ్ బ్యాటర్లలో అషుతోష్ శర్మ ఒక్కడే 30 పరుగుల మార్క్‌ను దాటాడు. జితేశ్ శర్మ ఒక్కడే 29 పరుగులతో పర్వాలేదనిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో కేశవ్ మహరాజ్ రెండు, ఆవేశ్ ఖాన్ రెండు, కుల్దీప్ సేన్, చాహల్ చెరో వికెట్ తీశారు.
రాజస్థాన్ బౌలర్ల జోరు...
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం సరైందే అని కాసేపటికే అర్థమైంది. 27 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. అధర్వను అవుట్ చేసి ఆవేశ్‌ఖాన్... పంజాబ్‌కు తొలి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 15 పరుగులు చేసి అథర్వ, 15 పరుగులు చేసి జానీ బెయిర్ స్టో పెవిలియన్‌కు చేరారు. జానీ బెయిర్ స్టోను కేశవ్ మహరాజ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ప్రభ్‌సిమ్రన్‌సింగ్ 10, కెప్టెన్ శామ్ కరణ్ ఆరు, జితేశ్ శర్మ 29, గత మ్యాచుల్లో రాణించిన శశాంక్ సింగ్ 9 త్వరత్వరగా పెవిలియన్ చేరారు. జితేశ్ శర్మ 29 పరుగులతో పర్వాలేదనిపించాడు. కానీ మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. పిట్ బౌలింగ్‌కు అనుకూలిస్తుండడంతో... రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పరుగులు రాకపోవడంతో పంజాబ్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడక తప్పలేదు. చివర్లో అషుతోష్ శర్మ బ్యాట్ ఝుళిపించడంతో పంజాబ్ ఆ మాత్రం స్కోరైనా చేసింది. అషుతోష్ శర్మ 11 బంతుల్లో ఒక ఫోరు, మూడు సిక్సులతో 31 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్ల ధాటికి పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితమైంది. రాజస్థాన్ బౌలర్లలో కేశవ్ మహరాజ్ రెండు, ఆవేశ్ ఖాన్ రెండు, కుల్దీప్ సేన్, చాహల్ చెరో వికెట్ తీశారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై పంజాబ్ బౌలర్లు సత్తా చాటి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మారుస్తారేమో చూడాలి.
పంజాబ్ గాడిన పడేనా..?
శిఖర్ ధావన్ సారథ్యంలోని పంజాబ్ ఇప్పటివరకూ అయిదు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచి మూడింటిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ వారికి కీలకంగా మారనుంది. అయిదు మ్యాచుల్లో ఆరు వికెట్లు తీసి పర్వాలేదనిపించిన కెప్టెన్ కరణ్ ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో రాణించాల్సి ఉంది. పంజాబ్ బౌలర్లు మెరుగ్గా రాణిస్తున్నారు. కగిసో రబడా, అర్ష్‌దీప్ సింగ్ పర్వాలేదనిపిస్తున్నారు. రాయల్స్ బ్యాటింగ్ దళం పటిష్టంగా ఉన్న వేళ రబాడ దళం వీరిని ఎలా అడ్డుకుంటుందో చూడాలి.