PBKS vs RR  IPL 2024 Preview and Prediction : ఈ ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్‌ రాయల్స్‌(RR) మరో కీలక సమరానికి సిద్ధమైంది. గత మ్యాచ్‌లో గుజరాత్‌(GT) చేతిలో తొలి పరాజయాన్ని చవిచూసిన రాజస్థాన్‌... అస్థిరంగా ఉన్న పంజాబ్‌ కింగ్స్‌(PBKS)తో అమీతుమీ తేల్చుకోనుంది. 
ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని రాజస్థాన్ రాయల్స్ పట్టుదలగా ఉంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్‌... ఎనిమిదో స్థానంలో ఉన్న పంజాబ్‌తో తలపడనుంది. పంజాబ్‌పై అయిదో విజయం నమోదు చేసి.. అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని రాజస్థాన్‌ పట్టుదలగా ఉంది.


విజయాల బాట పట్టాలని..
గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ చివరి బంతి వరకూ పోరాడినా విజయం దక్కలేదు. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన దశలో గుజరాత్‌ స్టార్‌ రషీద్‌ఖాన్‌ అద్భుత బౌండరీతో గిల్‌ సేనకు విజయాన్ని అందించాడు. ఈ ఓటమిని త్వరగా మర్చిపోయి బరిలోకి దిగాలని రాజస్థాన్‌ చూస్తోంది. పంజాబ్‌తో జరుగాల్సిన మ్యాచ్‌లో ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా సాధికార విజయం సాధించాలని రాజస్థాన్‌ భావిస్తోంది. సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్... చివరి రెండు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి గుజరాత్‌ చేతిలో ఓడింది. ట్రెంట్‌ బౌల్డ్‌కు పూర్తి కోటా బౌలింగ్ ఇవ్వకుండా రాజస్థాన్‌ వ్యూహాత్మక తప్పిదం చేసింది. మరోసారి ఇలాంటి తప్పులు చేయకూడదని సంజు శాంసన్‌ భావిస్తున్నాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌల్ట్‌ రెండు ఓవర్లు వేసి కేవలం ఎనిమిది పరుగులే ఇచ్చాడు. బౌల్ట్‌కు బౌలింగ్‌ ఇస్తే మ్యాచ్‌ ఫలితం ఇంకోలా ఉండేదన్న విశ్లేషణలున్నాయి. ఈ వ్యూహాత్మక తప్పిదాలు దాటేస్తే పంజాబ్‌పై రాజస్థాన్‌ గెలుపు తేలికే.



పంజాబ్‌ గాడిన పడేనా..?
శిఖర్ ధావన్ సారథ్యంలోని పంజాబ్‌ ఇప్పటివరకూ అయిదు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచి మూడింటిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ వారికి కీలకంగా మారనుంది. పంజాబ్ బ్యాటింగ్‌ వారిని ఆందోళన పరుస్తోంది. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ మినహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించడం లేదు. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో 5 మ్యాచ్‌ల్లో 81 పరుగులు, జితేష్ శర్మ 5 మ్యాచ్‌ల్లో 77 పరుగులు చేసి విఫలమవుతున్నారు. వీరు గాడిన పడకపోతే పంజాబ్‌కు కష్టాలు తప్పవు. శామ్ కరణ్‌ బౌలింగ్‌లో రాణిస్తున్నా బ్యాటింగ్‌లో విఫలమవుతున్నాడు. అయిదు మ్యాచుల్లో ఆరు వికెట్లు తీసి పర్వాలేదనిపించిన కరణ్‌.. బ్యాటింగ్‌లో మాత్రం 63 పరుగులు మాత్రమే చేశాడు. గాయపడిన లియామ్ లివింగ్‌స్టోన్ జట్టులో లేకపోవడం పంజాబ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను బలహీన పరిచింది. పంజాబ్ బౌలర్లు మెరుగ్గా రాణిస్తున్నా బ్యాటర్లు జూలు విదిలించాల్సి ఉంది. కగిసో రబడా, అర్ష్‌దీప్ సింగ్ పర్వాలేదనిపిస్తున్నారు. రాయల్స్ బ్యాటింగ్ దళం పటిష్టంగా ఉన్న వేళ రబాడ దళం వీరిని ఎలా అడ్డుకుంటుందో చూడాలి. 


">


జట్లు 
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్‌), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భట్యా , విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్. 


Also Read: రికార్డుల్లో శాంసన్‌ సేనదే పైచేయి


రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్‌), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డొనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర ఖాన్ చాహల్, అవేశ్వేంద్ర ఖాన్ చాహల్, , రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్‌మోర్, అబిద్ ముస్తాక్, నాంద్రే బర్గర్, తనుష్ కోటియన్, కేశవ్ మహారాజ్.