PBKS vs GT IPL 2024 Punjab Kings opt to bat: పంజాబ్ సొంత గడ్డ ముల్లాన్ పూర్ వేదికగా జరగనున్న ఐపీఎల్ 37వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న పంజాబ్ కింగ్స్(PBKS)తో-గుజరాత్ టైటాన్స్(GT) జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ప్రతీ మ్యాచ్... ప్రతీ పాయింట్ కీలకంగా మారిన వేళ..రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
గత ఎనిమిదేళ్లుగా కనీసం ప్లే ఆఫ్‌కు చేరిన పంజాబ్ సూపర్ కింగ్స్(PBKS).. మరోసారి ఆ దిశగా పయనిస్తుండడం ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఐపీఎల్(IPL) 2014 సీజన్ నుంచి నాకౌట్ దశకు చేరుకోలేదు. ఈ ఐపీఎల్లో ఇప్పటివరకూ ఏడు మ్యాచులు ఆడిన పంజాబ్ రెండు విజయాలు.. అయిదు ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లోనూ పంజాబ్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు పాయింట్ల పట్టికలో గుజరాత్ ఎనిమిదో స్థానంలో ఉంది. ఏడు మ్యాచుల్లో మూడు విజయాలు.. నాలుగు పరాజయాలతో కొనసాగుతోంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కేవలం 89 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీనిని ఢిల్లీ బ్యాటర్లు సునాయసంగా ఛేదించారు.
శిఖర్ ధావన్ సారథ్యంలోనూ పంజాబ్ ఓటమి కష్టాలు తప్పలేదు. అయితే నూతన సారధి శామ్ కరణ్ చేదు జ్ఞాపకాలను చెరిపేసి.. పంజాబ్‌ను విజయాల బాట పట్టించాలని చూస్తున్నారు. ఏప్రిల్ 9న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో భుజం గాయం కారణంగా ధావన్ మ్యాచ్‌కు దూరమవ్వగా... శామ్ కరణ్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, రిలీ రోసౌ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారు. ఇది పంజాబ్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. శశాంక్, అశుతోష్‌ల విధ్వంసంతోనే పంజాబ్ ఈ మాత్రమైనా రాణిస్తోంది. మరోవైపు మొదటి రెండు సీజన్‌లలో మంచి ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్(GT) ఈ సీజన్‌లో సవాళ్లను ఎదుర్కొంటోంది. ముంబైతో మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోయినా అశుతోష్ శర్మ అద్భుత పోరాటం ఆకట్టుకుంది. 193 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ 14 పరుగులకే నాలు వికెట్లు కోల్పోయినా అశుతోశ్... చివరి వరకూ పోరాడాడు. ఇవీ పంజాబ్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే అవకాశం ఉంది.
జట్లు:
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, మాథ్యూ వేడ్, కేన్ విలియమ్సన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, స్పెన్సర్ జాన్సన్, కార్తీక్ త్యాగి, జాషువా లిటిల్, దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మోహిత్ శర్మ, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, సుశాంత్ మిశ్రా, సందీప్ వారియర్, శరత్ బిఆర్, మానవ్ సుతార్.
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భట్యా , విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్.