IPL 2025 Nitish Rana Comments: మ్యాచ్ ఆడొద్దనుకున్నా.. ద్రవిడ్ తో మాట్లాడాను.. విధ్వంసక ఫిఫ్టీ చేశా.. నితీశ్ రాణా వెల్లడి
అనారోగ్యంతో మ్యాచ్ ఆడటం కూడా డౌట్ గానే అనిపించిందని, ద్రవిడ్ తో మాట్లాడిన తర్వాత ఆడినట్లు నితీశ్ తెలిపాడు. తనను నమ్మి, బాధ్యత అప్పగించడంతో, ఎలాగైనా నెరవేర్చాలని భావించానని వెల్లడించాడు.
RR Head Coach Rahul Dravid Imapact: రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ నితీశ్ రాణా.. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. తనకు అలవాటైన మూడో నెంబర్లో బ్యాటింగ్ చేసిన నితీశ్ కేవలం 36 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సిక్సర్లు, పది ఫోర్లు ఉండటం విశేషం. గువాహటిలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో తనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. దీంతో రెండు వరుస ఓటముల తర్వాత చెన్నైని మట్టికరిపించి, ఈ సీజన్ లో బోణీ కొట్టింది. ఇక ఈ మ్యాచ్ కు ముందు జరిగిన ఆసక్తికర విషయాన్ని తాజాగా నితీశ్ పంచుకున్నాడు. నిజానికి మ్యాచ్ కు ముందు తనకు ఒంట్లో బాగోలేకపోవడంతో ప్రాక్టీస్ సెషన్ ను స్కిప్ చేసినట్లు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. తనతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు పేర్కొన్నాడు. అనంతరం చెన్నైపై సత్తా చాటి విధ్వంసకర ఫిఫ్టీ చేశాడు.
రాహుల్ ఏం చెప్పాడంటే..
ఇక ఈ సీజన్ లో రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్ కాస్త మారింది. రెగ్యులర్ గా మూడో నెంబర్లో ఆడే నితీశ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగుతున్నాడు. అయితే విఫలమయ్యాడు. దీంతో ద్రవిడ్ తన వద్దకు వచ్చి, చెన్నైతో మ్యాచ్ లో మూడో నెంబర్లో బ్యాటింగ్ కు దిగాలని సూచించినట్లు తెలిపాడు. దీంతో తన అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా, చెన్నైపై బరిలోకి దిగినట్లు పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్ కు తన దైన శైలిలో హోం వర్క్ చేసి, స్టేడియానికి తగిన విధంగా షాట్లతో సిద్ధమైనట్లు పేర్కొన్నాడు. దీంతో తగిన ఫలితం సాధించినట్లు పేర్కొన్నాడు.
గత కొంతకాలంగా సాధన..
నిజానికి గత కొంతకాలంగా పరిస్థితులు, స్టేడియాలకు తగిన విధంగా సిద్ధమవుతున్నట్లు నితీశ్ తెలిపాడు. దీంతో చాలామటుకు సానుకూల ఫలితాలను సాధిస్తున్నట్లు వెల్లడించాడు. ఇక ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ ల్లో ఈ విధంగానే ప్రిపేరయ్యానని, అయితే కాలం కలిసి రాలేదని పేర్కొన్నాడు. ఇక ద్రవిడ్ తో మాట్లాడిన తర్వాత తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, మూడో నెంబర్లో ఆడటం కూడా కలిసొచ్చిందని అభిప్రాయ పడ్డాడు. తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయినా, తాము ఎంతో నేర్చుకున్నామని, సీజన్ ఆరంభంలోనే ఇలా జరగడం కొత్త అనుభవమని పేర్కొన్నాడు. ఇక ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో కేవలం ఆరు పరుగుల తేడాతో గెలిచి, ఈ సీజన్ లో తలి విజయాన్ని రాయల్స్ సాధించింది.