IPL 2025 SunRisers Hyderabad  News: ఐపీఎల్ కు సిద్ధ‌మ‌వుతున్న స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఫ్రాంచైజీకి గుడ్ న్యూస్. జ‌ట్టులో స్టార్ ఆల్ రౌండ‌ర్ నితీశ్ కుమార్ రెడ్డి.. పూర్తి ఫిట్ గా మారి, మెగాటోర్నీకి అందుబాటులోకి రాబోతున్నాడు. బీసీసీఐ నిర్వ‌హించిన ఫిట్ నెస్ ప‌రీక్ష‌ల్లో పాస‌య్యిన నితీశ్.. యోయో టెస్టును కూడా క్లియ‌ర్ చేసి, ఐపీఎల్ కు మార్గం సుగ‌మం చేసుకున్నాడు. త‌న రాక‌తో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండు విభాగాల్లో స‌న్ రైజ‌ర్స్ మ‌రింత ప‌టిష్టంగా మార‌నుంది. ఐపీఎల్ ఈనెల 22 నుంచి ప్రారంభం అవుతుండ‌గా, 23న సొంత‌గ‌డ్డ ఉప్ప‌ల్ మైదానంలో జ‌రిగే మ్యాచ్ తో స‌న్ రైజ‌ర్స్ బ‌రిలోకి దిగ‌నుంది. మాజీ చాంపియ‌న్స్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జ‌రిగే మ్యాచ్ ఆడ‌నుంది. మ‌రోవైపు ఈ మ్యాచ్ వ‌ర‌క‌ల్లా జ‌ట్టు కెప్టెన్ పాట్ క‌మిన్స్ కూడా అందుబాటులోకి రానున్నాడు. గాయంతో ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీకి దూర‌మైన క‌మిన్స్.. ఇప్పుడు పూర్తి ఫిట్ గా మారి, జ‌ట్టుతో క‌ల‌వ‌నున్నాడు. గ‌త సీజ‌న్ లో ఫియ‌ర్లెస్ ఆటతీరుతో ప్ర‌త్య‌ర్థుల‌ను వ‌ణికించిన స‌న్.. ఈసారి మ‌రింత పటిష్టంగా మ‌రింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ సూప‌ర్ స్ట్రాంగ్ అయింది. 


జ‌న‌వ‌రిలో గాయ‌ప‌డ్డ నితీశ్..
జ‌న‌వ‌రిలో ఐదు టీ2ల సిరీస్ లో భాగంగా కోల్ క‌తాలో ఇంగ్లాండ్ తో జ‌రిగిన తొలి మ్యాచ్ లో నితీశ్ చివ‌రిసారిగా బ‌రిలోకి దిగాడు. అయితే ఆ మ్యాచ్ లో త‌న‌కు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ చేసే అవ‌కాశం రాలేదు. ఆ త‌ర్వాతి మ్యాచ్ కు సిద్ధ‌మ‌వుతూ, నెట్ లో గాయ‌ప‌డి, మొత్తం సిరీస్ కే దూర‌మ‌య్యాడు. అప్ప‌టి నుంచి చికిత్స తీసుకుంటున్న నితీశ్ ప్ర‌స్తుతం ఫుల్ ఫిట్ గా మారాడు. గ‌తేడాది ఐపీఎల్తో వెలుగులోకి వ‌చ్చిన నితీశ్, ఆల్ రౌండ‌ర్ గా రెండు విభాగాల్లో స‌త్తా చాటాడు. టోర్నీలో త‌న ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్ర‌ద‌ర్శ‌నో జాతీయ‌జ‌ట్టులోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. తొలుత టీ20 జ‌ట్టులోకి అరంగేట్రం చేసిన నితీశ్.. ఆ త‌ర్వాత మెల్ బోర్న్ లో కీల‌క‌మైన సెంచ‌రీ కూడా చేసి, విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు. 


రిటైన్ చేసుకున్న స‌న్ రైజ‌ర్స్..
నితీశ్ పొటెన్షియ‌ల్ ను పసిగ‌ట్టిన స‌న్ రైజ‌ర్స్ హైదరా బాద్ జట్టు అత‌డిని రూ.6 కోట్ల‌తో రిటైన్ చేసుకుంది. ఈ క్ర‌మంలో స‌న్ కోర్ టీమ్ లో త‌ను కీల‌క‌మైన ప్లేయ‌ర్ గా మారాడు. మ‌రోవైపు 2013 నుంచి ఆడుతున్న స‌న్.. కేవ‌లం ఒక్క‌సారి మాత్ర‌మే టైటిల్ గెలిచింది. డేవిడ్ వార్న‌ర్ సార‌థ్యంలో 2016లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరును ఓడించి విజేత‌గా నిలిచింది. ఆ త‌ర్వాత 2018లో చెన్నై సూప‌ర్ కింగ్స్ చేతిలో, 2024లో కోల్ క‌తా నైట్ రైడర్స్ చేతిలో ప‌రాజ‌యం పాలై ర‌న్న‌ర‌ప్ తో స‌రిపెట్టుకుంది. ఈ సారి ఎలాగైనా విజేత‌గా నిల‌వాల‌ని జ‌ట్టు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. అందుకు తగిన విధంగా స్క్వాడ్ ను సమీకరించి, రాబోయే ఐపీఎల్ కు సిద్ధం అవుతోంది.