MS Dhoni to Miss DC vs CSK Clash:ఐపీఎల్ (IPL 2026)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. టీమ్ స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇంకా పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధించలేదు. మంగళవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని సిఎస్‌కే బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సైమన్స్ ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అధికారికంగా వెల్లడించాడు. ధోనీ కాఫ్ ఇంజూరీ (Calf Injury) నుంచి కోలుకుంటున్నాడని, అయితే ప్రస్తుతానికి అతను టీమ్‌తో కలిసి ఢిల్లీకి ప్రయాణించలేదని సైమన్స్ క్లారిటీ ఇచ్చాడు.
ధోనీ ఫిట్‌నెస్‌పై సైమన్స్ అప్‌డేట్..ధోనీ ఎప్పుడు ఆడతాడు అనే విషయంపై అడిగిన ప్రశ్నకు సైమన్స్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ధోనీ అప్‌డేట్ ఇవ్వడం తన స్థాయికి మించిన విషయమని, అతను ప్రస్తుతం తమతో లేడు కానీ క్రమంగా కోలుకుంటున్నాడని తెలిపాడు. ఎప్పుడు సిద్ధంగా ఉండాలో అతనికి బాగా తెలుసని, సిద్ధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా బరిలోకి దిగుతాడని సైమన్స్ పేర్కొన్నాడు. ధోనీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గతేడాది మే 25న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత అతను మళ్ళీ ఐపీఎల్ గ్రౌండ్ లో కనిపించలేదు. ధోనీ రాక కోసం కోట్లాది మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అతను గ్రౌండ్ లోకి అడుగుపెడితే ఆ జోష్ వేరే లెవల్ లో ఉంటుంది. ఢిల్లీతో జరిగే ఈ మ్యాచ్ సిఎస్‌కే కి చాలా కీలకం కానుంది.
సిఎస్‌కే ప్లేఆఫ్స్ లెక్కలు..ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదుసార్లు ఛాంపియన్ అయిన సిఎస్‌కే ఆరో స్థానంలో ఉంది. ఆడిన తొమ్మిది మ్యాచుల్లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే అందుకుంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన మ్యాచుల్లో కనీసం నాలుగు విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఇలాంటి టఫ్ సిట్యువేషన్ లో ధోనీ లేకపోవడం జట్టుకు ఒక లోటు అని చెప్పాలి. అయితే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మళ్ళీ ఫామ్‌లోకి రావడం టీమ్ కు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. గత రెండు మ్యాచుల్లో అతను 74, 67 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.
తపస్సులాంటి బ్యాటింగ్.. రుతురాజ్ ది..కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ స్టైల్ పై ఎరిక్ సైమన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. బ్యాటింగ్ మధ్య లో తాను చాలా ఏకాంతగా, తపస్సు చేసినట్లు ఆడతాడని, చాలా ప్రశాంతంగా కనిపిస్తూనే వికెట్లు కష్టంగా ఉన్నప్పుడు పోరాడుతాడని పేర్కొన్నాడు. మంచి వికెట్ల మీదే కాకుండా కష్టమైన పిచ్ లపై పరుగులు చేయడమే ఒక క్వాలిటీ బ్యాటర్ లక్షణమని, అతను కేవలం 22 బంతుల్లో 50 పరుగులు చేసినా సరే ఎవరూ నోటీస్ చేయలేనంత క్లీన్ గా అతని ఆట ఉంటుందని పేర్కొన్నాడు.. నాయకుడిగా అతనిపై తమకు ఎప్పుడూ నమ్మకం ఉందని, ఇప్పుడు రన్స్ కూడా రావడం చాలా సంతోషమని సైమన్స్ వివరించాడు.
దూబే, బ్రెవిస్ ఫామ్ పై ఆశలు..జట్టులో సంజు శాంసన్, ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ వంటి వారు మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ.. శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్ ఇంకా ఆశించిన స్థాయిలో రాణించట్లేదు. దూబే ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 150 రన్స్ చేసి కాస్త తడబడుతున్నాడు. అలాగే సైడ్ స్ట్రెయిన్ కారణంగా కొన్ని మ్యాచులకు దూరమైన బ్రెవిస్, ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో కేవలం 64 పరుగులే చేశాడు. వీరిద్దరి గురించి సైమన్స్ మాట్లాడుతూ.. వాళ్లకు ఎటువంటి సమస్య లేదని, ఈ టోర్నీలో టాప్ ప్లేయర్లు కొన్నిసార్లు ఇబ్బంది పడటం సహజమని అన్నాడు. వారు చాలా ఎక్స్ పీరియన్స్ ఉన్న క్రికెటర్లని, వాళ్ల క్వాలిటీ ఏంటో తమకు తెలుసని, ఏ క్షణంలోనైనా వాళ్లు ఫామ్ లోకి వచ్చి మ్యాచ్ ను మలుపు తిప్పగలరని ధీమా వ్యక్తం చేశాడు.
