Jacob Bethell to Leave RCB and Return to England: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) క్యాంప్ లో ఉన్న యువ ఆటగాడు జేకబ్ బెథెల్ పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్‌సీబీ ఆడే మిగతా మ్యాచ్‌ల్లో బెథెల్ ఫస్ట్-ఛాయిస్ ప్లేయర్ కాకపోతే, ఆయన వెంటనే ఐపీఎల్ వీడి స్వదేశానికి తిరిగి రావాలని వాగన్ కోరారు. ఇంతకుముందు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు అలిస్టర్ కుక్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, బెథెల్ ఇంగ్లండ్ చేరుకుని రెడ్-బాల్ (టెస్ట్ క్రికెట్) డెవలప్‌మెంట్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో బెథెల్ ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్ నుండి తప్పుకున్న నేపథ్యంలో ఈ చర్చ మొదలైంది.

Continues below advertisement

Read Also: Virat Kohli vs Travis Head : కోహ్లీ... నీకు అంత అహంకారమా? హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడంపై నెటిజన్లు ఫైర్!

వేలి గాయంతో లీగ్ మ్యాచ్ కు దూరం.. 

Continues below advertisement

సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ టాస్ సమయంలో ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ అప్‌డేట్ ఇచ్చాడు. జేకబ్ బెథెల్ వేలి గాయం (Finger Injury) కారణంగా ఈ మ్యాచ్ కు అందుబాటులో లేరని ప్రకటించాడు. బెథెల్ స్థానంలో కెప్టెన్ పాటిదార్ స్వయంగా తుది జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ పరిణామంపై ఒక టాక్ షోలో మైఖేల్ వాన్ స్పందిస్తూ, బెథెల్ నిజంగా గాయపడి ఉంటే తదుపరి విమానంలోనే ఇంగ్లండ్ వెళ్లడం మంచిదని అభిప్రాయపడ్డాడు. జూన్ 4 నుండి న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడనుందని, ఆలోపు బెథెల్ ఫిట్‌నెస్ ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అసెస్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు.

Read Also: IPL 2026 PBKS VS LSG Result Update: శ్రేయ‌స్ కెప్టెన్ ఇన్నింగ్స్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా.. నాకౌట్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన ప్ర‌భ్ సిమ్రాన్.. టోర్నీ నుంచి ఢిల్లీ ఔట్ 

ఇంగ్లండ్ ట్రైనింగ్ క్యాంప్ ముఖ్యం..

గాయం కారణంగా మ్యాచ్ లు ఆడే అవకాశం లేనప్పుడు యూకే (UK) లో ఉండటమే బెథెల్‌కు బెటర్ అని వాన్ పేర్కొన్నాడు. తాను కొంచెం ఓల్డ్ స్కూల్ పద్ధతిలో ఆలోచిస్తున్నట్లు అనిపించినా, దేశం కోసం ఆడటమే ముఖ్యం అని చెప్పాడు. వచ్చే వారం ఇంగ్లండ్ జట్టుకు స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్ ఉందని, కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ఆదివారం ఉదయం యూకే చేరుకోనున్నాడ‌ని గుర్తు చేశాడు. సోమవారం నుండి ఈ క్యాంప్ ప్రారంభం కానున్నందున, బెథెల్ తన టీమ్ మెంబర్స్‌తో కలవాలని సూచించాడు. ఐపీఎల్ ఆడటం వల్ల యువ ఆటగాళ్లకు మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తుందనే విషయాన్ని తాను నమ్ముతానని, అయితే బెథెల్ గత ఏడాది కూడా ఇక్కడ ఉన్నాడని, ఈసారి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని విశ్లేషించాడు

ప్లేఆఫ్స్ ఫీజు కట్ వివాదం.. ఈ ప్యానెల్ డిస్కషన్‌లో పాల్గొన్న భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఒక ఆసక్తికరమైన పాయింట్‌ను లేవనెత్తాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయిన తరుణంలో, బెథెల్ ఇప్పుడు ఇంగ్లండ్ వెళ్తే తన మ్యాచ్ ఫీజు లేదా పే-కట్ (Pay Cut) అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడే ఉండి ఉండవచ్చని జహీర్ అభిప్రాయపడ్డాడు. దీనికి వాన్ వెంటనే స్పందిస్తూ, అత‌డు ఇప్పటికే ఐపీఎల్ లో తగినంత సమయం గడిపాడని, పే-కట్ అయినా పర్వాలేదు కానీ ఒక వారం మిస్ అయితే నష్టం లేదని కౌంటర్ ఇచ్చాడు. టెస్ట్ సిరీస్ ముందర ఫిట్‌నెస్ సాధించడంపైనే బెథెల్ ప్రాధాన్యత ఇవ్వాలని వాగన్ స్పష్టం చేశాడు.