Mumbai Indians vs Rajasthan Royals: ఐపీఎల్‌ 2023 సీజన్ 42వ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ (RR) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట ముంబై ఇండియన్స్ (MI) బౌలింగ్ చేయనుంది. ఐపీఎల్ చరిత్రలో ఇది 1000వ మ్యాచ్.


పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ తొమ్మిదో స్థానంలోనూ, రాజస్తాన్ రాయల్స్ రెండో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి వెళ్లే అవకాశం ఉంది. అదే ముంబై ఇండియన్స్ గెలిస్తే వారు ఐదో స్థానం వరకు వెళ్లే అవకాశం కూడా ఉంది.


రాజస్తాన్ రాయల్స్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్


రాజస్తాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
డోనోవన్ ఫెరీరా, మురుగన్ అశ్విన్, రియాన్ పరాగ్, కుల్దీప్ యాదవ్, కుల్దీప్ సేన్


ముంబై ఇండియన్స్ తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, రిలే మెరెడిత్, అర్షద్ ఖాన్


ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
నేహాల్ వధేరా, రమణదీప్ సింగ్, విష్ణు వినోద్, షామ్స్ ములానీ, అర్జున్ టెండూల్కర్


పదహారేండ్లుగా భారత్‌తో పాటు ప్రపంచ క్రికెట్‌ అభిమానులను అలరిస్తూ మరే క్రికెట్ లీగ్‌కూ అందనంత ఎత్తుకు ఎదిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో నేడు మరో  ప్రత్యేకత సాక్షాత్కారం కాబోతుంది. ముంబై ఇండియన్స్ - రాజస్తాన్ రాయల్స్ మధ్య వాంఖెడే (ముంబై) వేదికగా జరుగబోయే మ్యాచ్  ఈ లీగ్‌లో  1000వ మ్యాచ్ కావడం గమనార్హం. 


వాంఖెడేలో జరుగుబోయే  1000వ మ్యాచ్  ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా స్పెషల్. ఇవాళ (ఏప్రిల్ 30)  హిట్‌మ్యాన్  పుట్టినరోజు. అదీగాక  ముంబై ఇండియన్స్ పగ్గాలు (2013 ఏప్రిల్ 24) చేపట్టి కూడా  పది సంవత్సరాలు పూర్తి కావొచ్చింది. అంతేగాక కెప్టెన్ గా రోహిత్ కు ఇది 150వ మ్యాచ్.  దీంతో ఈ మ్యాచ్‌ను గెలిచి  రోహిత్‌కు బర్త్ డే గిఫ్ట్ గా అందజేయాలని  ముంబై  ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. ఓపెనర్ గా ఇషాన్ కిషన్ విఫలమవుతున్నా  కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ మంచి టచ్ లో ఉన్నారు.  పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో టచ్ లోకి వచ్చిన  సూర్య గుజరాత్ తో  కూడా బాగానే  ఆడాడు.  చివర్లో  టిమ్ డేవిడ్ కూడా ఓ చేయి వేస్తే వాంఖెడేలో  పరుగుల వరద ఖాయం. మరి వీరిని రాజస్తాన్ బౌలర్లను ఎలా ఎదుర్కుంటారన్నది ఆసక్తికరం.


బౌలింగ్ లో ఆ జట్టు కీలక పేసర్ జోఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్ ఆడే అవకాశాలున్నాయి.  అర్జున్ టెండూల్కర్,  జేసన్ బెహ్రాన్‌డార్ఫ్ లు పేస్ బాధ్యతలు మోయనున్నారు.  ఆర్చర్ వస్తే  వీరిలో ఎవరో ఒకరు  బెంచ్ కే పరిమితం కావొచ్చు. స్పిన్నర్లలో పీయూష్ చావ్లా ఫామ్ కొనసాగిస్తుండటం ముంబైకి కలిసొచ్చేదే.