MI vs RR, IPL 2023: 


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో నేడు 1000వ మ్యాచ్‌ జరుగుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక పోరులో ఐదుసార్లు ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, అరంగేట్రం విజేత రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడుతున్నాయి. సంజూ శామ్సన్‌ నేతృత్వంలోని రాజస్థాన్‌ మోడర్న్‌గా కనిపిస్తోంది. టీ20లకు సరిపోయే సెటప్‌ను క్రియేట్ చేసుకొంది. మరోవైపు విలువైన ఆటగాళ్ల సేవలు కోల్పోయిన ముంబయి.. విజయాల కోసం తపిస్తోంది. మరి నేటి పోరులో తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి! ఇంపాక్ట్‌ ప్లేయర్‌ స్ట్రాటజీ ఏంటి?


ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians)


తొలుత బ్యాటింగ్ చేస్తే: రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, కామెరాన్‌ గ్రీన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, టిమ్ డేవిడ్‌, నేహల్‌ వధేరా, జోఫ్రా ఆర్చర్‌, పియూష్ చావ్లా, అర్జున్‌ తెందూల్కర్‌, జేసన్ బెరెన్‌డార్ఫ్‌


తొలుత ఫీల్డింగ్‌ బౌలింగ్‌ చేస్తే: రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, కామెరాన్‌ గ్రీన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, టిమ్ డేవిడ్‌, నేహల్‌ వధేరా, జోఫ్రా ఆర్చర్‌, పియూష్ చావ్లా, అర్జున్‌ తెందూల్కర్‌, కుమార్‌ కార్తికేయా, జేసన్ బెరెన్‌డార్ఫ్‌


ఇంగ్లాండ్ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తే రిలే మెరిడీత్‌ను రిప్లేస్‌ చేస్తాడు. ఒకవేళ మొదట బ్యాటింగ్‌ చేస్తే తిలక్‌ వర్మ తుది జట్టులో ఉంటాడు. తర్వాత అతడి బదులు కుమార్‌ కార్తికేయా ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వస్తాడు. టాస్‌ను బట్టి వీరిద్దరూ మారతారు.


రాజస్థాన్ రాయల్స్‌ (Rajasthan Royals)


తొలుత బ్యాటింగ్‌ చేస్తే: యశస్వీ జైశ్వాల్‌, జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌, దేవదత్‌ పడిక్కల్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, ధ్రువ్‌ జోరెల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, జేసన్ హోల్డర్‌, ట్రెంట్ బౌల్ట్‌, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్‌


తొలుత బౌలింగ్‌ చేస్తే: యశస్వీ జైశ్వాల్‌, జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, ధ్రువ్‌ జోరెల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, జేసన్ హోల్డర్‌, ట్రెంట్ బౌల్ట్‌, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌


చివరి మ్యాచులో కుల్‌దీప్‌ యాదవ్ అదరగొట్టాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌పై 3 ఓవర్లు వేసి 18 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. రాజస్థాన్ మొదట బౌలింగ్‌ చేస్తే అతడు తుది జట్టులో ఉంటాడు. ఛేదనలో దేవదత్‌ పడిక్కల్‌ అతడిని ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా సబ్‌స్టిట్యూట్‌ చేస్తాడు. టాస్‌ను బట్టి వీరిద్దరే రిప్లేస్‌ అవుతారు.