Suryakumar yadav disappointed: ఢిల్లీ క్యాపిటల్స్(DC)తో జరిగిన మ్యాచ్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్(Suryakumar yadav )రెండో బంతికే అవుటై నిరాశ పరిచాడు. ఎన్నో అంచనాల మధ్య వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన సూర్యకుమార్ యాదవ్... నోకియా బౌలింగ్‌లో ఫ్రేజర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. రెండు బంతులు ఎదుర్కొన్న సూర్య ఒక్క పరుగు కూడా చేయకుండా అవుటయ్యాడు. ఆరు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు పడడంతో ముంబై స్కోరు మందగించింది. దీంతో 81 పరుగుల వద్ద ముంబయి రెండో వికెట్‌ను కోల్పోయింది. సూర్య అవుటయ్యే సమయానికి 8 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 84/2.
ఆపరేషన్ అనంతరం...
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఫీల్డింగ్ చేస్తుండగా సూర్య కాలు మెలిక పడింది. చీలమండలో చీలిక వచ్చినట్లు కోలుకోవడానికి వారాలు పట్టనున్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో సూర్యకుమార్ యాదవ్ దాదాపు రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరం అయ్యాడు గాయం కారణంగా జనవరి 11న స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో ఆరంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌కు సూర్య భాయ్ అందుబాటులో లేదు. జాతీయ క్రికెట్ అకాడమీలో సూర్య కోలుకున్నాడు.
సూర్య విధ్వంసం...
ఐసీసీ(ICC) ఏటా అందించే ప్రతిష్ఠాత్మక టీ20 క్రికెటర్ ఆఫ్ ఇది ఇయర్ 2023(T20 Cricketer of the Year Award 2023) అవార్డును టీమిండియా(Team India) విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) గెలుచుకున్నాడు. మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుగా నిలిచి పొట్టి క్రికెట్‌లో తన మార్క్ చాటాడు. టీ 20లో ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్... జింబాబ్వే సారథి సికిందర్ రజా, న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ మార్క్ చాప్‌మన్, ఉగాండా సంచలనం అల్పేష్ రమ్జానీ ఈ అవార్డు కోసం పోటీ పడ్డారు. కానీ చివరికి ఈ అవార్డు సూర్య భాయ్‌నే వరించింది. సూర్యకుమార్ యాదవ్ 2023లో పరుగుల వరద పారించాడు. సఫారీ గడ్డపై తాజాగా సెంచరీతో ఈ ఫార్మాట్‌లో నాలుగో శతకం ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది మొత్తం 17 ఇన్నింగ్స్‌ల్లో సూర్యా భాయ్ 155.95 స్ట్రైక్ రేటుతో 733 రన్స్ కొట్టాడు.
ఐసీసీ టీ 20 జట్టు కెప్టెన్‌గానూ...
టీమిండియా(Team India) టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)కు అరుదైన గౌరవం దక్కింది. టీ 20 క్రికెట్‌లో మెరుపులు మెరిపించే ఈ విధ్వంసకర ఆటగాడిని 2023 ఐసీసీ టీ 20 క్రికెట్ జట్టు కెప్టెన్‌గా నియమించింది.