197 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన రాజస్థాన్‌  పవర్ ప్లే లోపే ఇద్దరు  ఓపెనర్లఅను కోల్పోయింది.  తొలి బంతికి జైస్వాల్‌ ఒక్క పరుగు రాబట్టాడు. ఓవైపు జైస్వాల్‌, మరో వైపు బట్లర్‌ క్రీజులో నిలదొక్కుకుంటూ పరుగులు రాబడుతుండగా ఆరో ఓవర్‌లో యశ్ ఠాకూర్‌ వేసిన  ఐదో బంతికి జోస్ బట్లర్  ఔటయ్యాడు. దీంతో 60 పరుగుల వద్ద రాజస్థాన్‌ తొలి వికెట్ కోల్పోయింది. పవర్‌ ప్లే ముగిసేసరికి స్కోరు 60/1.  ఆరవ ఓవర్ కు బౌలింగ్ కి  దిగిన మార్కస్ స్టాయినిస్‌ తన స్పెల్‌లో తొలి బంతికే వికెట్ పడగొట్టాడు.  అతడు వేసిన 6.1 ఓవర్‌కు యశస్వి జైస్వాల్ రవి బిష్ణోయ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. 


ఆదుకున్న కేఎల్ రాహుల్, దీపక్ హూడా.. రాజస్థాన్ టార్గెట్ 197


లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో  రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి లక్నో సూపర్ జెయింట్స్ ని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఆరంభంలో తడబడిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి   196 పరుగులు  చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడాలు హాఫ్ సెంచరీలతో రాణించారు. 


వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ లో ఇన్నింగ్స్ మొదట్లో లక్నో తడబడిన ఆ తర్వాత నిదానంగా స్కోర్ బోర్డ్ పై పరుగులను పెంచుకోగలిగింది. తొలి రెండు బంతులకు బౌండరీలు బాదిన డికాక్‌  ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన బంతికి బౌల్డ్‌ అయి పెవిలియన్‌కు చేరాడు. తరువాత రెండవ ఓవర్ లోనే  మార్కస్‌ స్టాయినిస్‌  కూడా డకౌట్‌ అయ్యాడు. దీంతో లక్నో ఆదిలోనే రెండు వికెట్లను కోల్పోయింది. అయితే  కెప్టెన్ కేఎల్ రాహుల్(కేఎల్ రాహుల్ 48 బంతులలో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు), దీపక్ హుడా(31 బంతులలో 7 ఫోర్ల సహాయంతో 50 పరుగులు)లతో  చెల‌రేగారు. నికలోస్ పురన్ 11 పరుగులు చేయగా ,౧౮ pపరుగులతో ఆయుష్ బదోని, 16 పరుగులతో కృనాల్ పాండ్యా  అజేయంగా నిలిచారు. ఇక రాజస్థాన్ బౌలర్స్ విషయానికి కొస్తే.. సందీప్ శర్మ రెండు వికెట్లు తీసుకోగా.., ట్రెంట్ బోల్ట్, ఆవేష్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీశారు.