Lucknow Super Giants vs Delhi Capitals: ఐపీఎల్ 2023 సీజన్ మూడో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో రెండు జట్లకూ ఇదే తొలి మ్యాచ్. రిషబ్ పంత్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. దీంతో డేవిడ్ వార్నర్‌కు ఢిల్లీ మేనేజ్‌మెంట్ కెప్టెన్సీని అందించింది. రిషబ్ పంత్ స్థానంలో యువ ఆటగాడు అభిషేక్ పోరెల్‌ను జట్టులోకి తీసుకున్నారు.


లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు
కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), ఆయుష్ బడోని, మార్క్ వుడ్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్


ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, సర్ఫరాజ్ ఖాన్ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్


అరంగేట్రంతోనే అదరగొట్టిన జట్టు లక్నో సూపర్‌ జెయింట్స్‌! ఆటగాళ్ల ఎంపిక నుంచి స్టేడియంలో అడుగుపెట్టేంత వరకు ప్రతిదీ పక్కాగా ప్లాన్‌ చేస్తారు. ఇంటర్నేషనల్‌ లెవల్‌ ఆల్‌రౌండర్లు ఉండటంత ఎల్‌ఎస్‌జీ బలం. అన్నీ కుదిరితే జట్టులోని పదకొండు మందీ దుమ్మురేపగలరు. కొన్నాళ్లుగా ఇబ్బంది పడ్డ రాహుల్‌ ఈ మధ్యే ఫామ్‌లోకి వచ్చాడు. పైగా ఇష్టమైన ఐపీఎల్‌లో ఎలా పరుగులు చేస్తాడో తెలిసిందే. క్వింటన్‌ డికాక్‌, నికోలస్‌ పూరన్‌ దంచికొడుతున్నారు. మిడిల్‌ నుంచి లోయర్‌ ఆర్డర్లో దీపక్‌ హుడా, ఆయుష్ బదోనీ, కృనాల్‌ పాండ్య, డేనియెల్‌ సామ్స్‌, మార్కస్‌ స్టాయినిస్‌ ఉన్నారు. అవేశ్‌ ఖాన్‌, మొహిసన్ ఖాన్‌, మార్క్‌వుడ్‌, జయదేశ్ ఉనద్కత్‌ పేస్‌ చూస్తారు. కృనాల్‌, బదోనీ, హుడా, రవి బిష్ణోయ్‌ స్పిన్‌ ఇరగదీస్తారు. సమతూకం కుదిరితే ఎదురులేని జట్టిది.


 


ఐపీఎల్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రామిసింగ్‌ టీమ్‌! సీజన్‌ మారే కొద్దీ బలంగా మారుతోంది. ఈసారి రిషభ్ పంత్‌ లేకపోవడం పెద్ద వీక్‌నెస్‌! అయితే డేవిడ్‌ వార్నర్‌కు కెప్టెన్సీ ఇవ్వడం ఆశలు రేపుతోంది. లీగ్‌ దశలో అదరగొడుతున్న ఢిల్లీ ప్లేఆఫ్స్‌లో ఒత్తిడికి చిత్తవుతోంది. దీన్నుంచి వేగంగా బయటపడాల్సి. మిచెల్‌ మార్ష్‌ మంచి ఫామ్‌లో ఉండటం, బిగ్‌మ్యాచ్‌ ప్లేయర్ కావడం ప్లస్‌ పాయింట్‌. పంత్‌ స్థానంలో తీసుకున్న అభిషేక్‌ పొరెల్‌ ఎలా రాణిస్తాడో చూడాలి. పృథ్వీ షా, వార్నర్‌ ఓపెనింగ్‌కు వస్తారు. మిచెల్‌ మార్ష్‌ వన్‌డౌన్‌లో వస్తాడు.  మిడిలార్డర్లో సర్ఫరాజ్‌ ఖాన్‌, మనీశ్‌ పాండే, ఫిల్‌సాల్ట్‌, రిలీ రొసొ, అక్షర్‌ పటేల్‌, కీలకం అవుతారు. ఖలీల్‌ అహ్మద్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ముకేశ్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, ఎంగిడి, నోకియా, సకారియా, ఇషాంత్‌ వంటి బౌలింగ్‌ దళం వీరి సొంతం.


ఢిల్లీ క్యాపిటల్స్‌పై లక్నో సూపర్‌ జెయింట్స్‌దే పైచేయి! గతేడాది జరిగిన రెండు మ్యాచుల్లోనూ రెండుసార్లూ రాహుల్‌ సేనే గెలిచింది. ఈసారీ అలాంటి డామినేషన్‌తోనే సీజన్ మొదలుపెట్టాలని పట్టుదలగా ఉంది. తమ బలహీనతల నుంచి బయటపడాలని ఢిల్లీ కోరుకుంటోంది.