LSG vs DC Match Highlights In IPL 2024: ఐపీఎల్...! యంగ్ క్రికెటర్స్ టాలెంట్ ను బయటికి తీసే వేదిక మాత్రమే కాదు... ఫామ్ లోని సీనియర్ ఆటగాళ్లను టచ్ లోకి తెచ్చే అద్భుతమైన వేదిక. అందుకే...ఐపీఎల్ సీజన్ ఫర్మామెన్స్ ల తరువాత..టీం ఇండియా జట్టును సెలక్ట్ చేయాలంటే తల ప్రాణం తోకలోకి వస్తుంది. స్టార్స్ ఫామ్ లో లేకపోయినా తీసుకోవాలి. దుమ్ము దులిపిన కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలి. ఫాంలోకి వచ్చిన సీనియర్ ఆటగాళ్లను పరిగణలోకి తీసుకోవాలి. అలా అన్నింటిని కవర్ చేస్తూ వచ్చే టీ20 వరల్డ్ కప్ టీమ్ ను సెలక్ట్ చేయడం అంతా ఈజీ కాదు. ఈ టాస్క్ ను మరింత సంక్లిష్ఠం చేస్తున్నారు దినేశ్ కార్తీక్ అండ్ కుల్దీప్ యాదవ్.


వీళ్లిద్దరు టీ20ల్లో బాగా రాణిస్తున్నప్పిటకీ..జూనియర్స్ వల్ల టీంలో ప్లేస్ దక్కట్లేదు. అందుకేనేమో ఈ సారి కుర్రాళ్లకు దీటుగా ఫర్మామెన్స్ ఇస్తున్నారు. లక్నో వెర్సస్ దిల్లీ మ్యాచులో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు అదరగొట్టాడు. 4 ఓవర్లు వేసి ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు మనోడి బౌలింగ్ ఏ రేంజ్ లో పడిందో. దిల్లీ ఫర్మామెన్స్ అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ..కుల్దీప్ యాదవ్ సత్తా చాటుతున్నాడు. అలాగే, ఆర్సీబీ ఫర్మామెన్స్ ఎలా ఉన్నప్పటికీ కూల్ ఫినిషర్ గా దినేశ్ కార్తీక్ రాణిస్తున్నాడు. 6 మ్యాచులు ఆడిన దినేశ్...5 ఇన్నింగ్స్ లో 140కిపైగా పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ 190 ప్లస్ ఉంది. అంటే ఆల్ మోస్ట్ ఎన్ని బాల్స్ ఆడితే..దానికి డబుల్ స్కోర్ కొడుతున్నాడు అనమాట. ముంబయి పై హాఫ్ సెంచరీ ఐతే హైలైట్ అనే చెప్పుకోవాలి. అది చూసి ఇండియన్ టీ20 కెప్టెన్ రోహిత్ శర్మే... టీం ఇండియాలో చోటు కోసం ఇరగదీస్తున్నావ్ అని కితాబునిచ్చాడు. ఇలా.. పది టీమ్స్ లో ఒక్కొక్క టీమ్ నుంచి ఇద్దరు,ముగ్గురు ప్లేయర్స్ టీం ఇండియా సెలక్టర్లు తమవైపు చూసేలా చేస్తున్నారు. అంటే సీజన్ అయ్యే లోపల ఆల్ మోస్ట్ సూపర్ 30 లో నుంచి 15 మందిని ఎంపిక చేయడం సెలక్టర్లకు కష్టమే అని చెప్పుకోవచ్చు.