IPL 2025 GT VS DC Updates: ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్.. గుజ‌రాత్ టైటాన్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో రెండు రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో 57 బంతుల్లో 112 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచిన రాహుల్.. 14 ఫోర్లు, 4 సిక్స‌ర్లు బాదాడు. అయితే ఈక్ర‌మంలో త‌న ఐపీఎల్ కెరీర్లో ఐదో సెంచ‌రీని సాధించాడు. ఈ క్ర‌మంలో ఈ టోర్నీలో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఇండియ‌న్ బ్యాట‌ర్ గా నిలిచాడు. ఓవ‌రాల్ గా అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన నాలుగో బ్యాట‌ర్ గా రికార్డుల‌కెక్కాడు. విరాట్ కోహ్లీ అంద‌రికంటే ఎక్కువ‌గా 8 సెంచ‌రీలు సాధించి, ఈ జాబితాలో అగ్ర‌స్థానంలో నిలిచాడు. ఆ త‌ర్వాత ఏడు సెంచ‌రీల‌తో జోస్ బ‌ట్ల‌ర్, క్రిస్ గేల్ (ఆరు) త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు. అలాగే త‌ను మ‌రో రికార్డును కూడా త‌న పేరిట లిఖించుకున్నాడు.

Continues below advertisement






ఒకే ఒక్క‌డు..
మూడు వేర్వేరు జ‌ట్ల త‌ర‌పున సెంచరీలు చేసిన ఏకైక బ్యాట‌ర్ గా కేఎల్ రాహుల్ నిలిచాడు. కోహ్లీ సాధించిన ఎనిమిది సెంచ‌రీలు ఆర్సీబీ త‌ర‌పున చేయ‌గా.. రాహుల్ మాత్రం.. పంజాబ్ కింగ్స్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్, తాజాగా ఢిల్లీ త‌ర‌పున శ‌తకాలు బాదాడు. ఇక ఈ మ్యాచ్ లోనే గుజ‌రాత్ కెప్టెన్ శుభ‌మాన్ గిల్ మ‌రో రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అతి త‌క్కువ ఇన్నింగ్స్ లో 5వేల ప‌రుగులు చేసిన రెండో భార‌త ప్లేయ‌ర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో అర్థ సెంచ‌రీ చేసిన గిల్.. 143వ ఇన్నింగ్స్ లోనే ఈ ఘ‌న‌త సాధించాడు. అయితే ఇత‌ని కంటే ముందు కేఎల్ రాహుల్ కేవ‌లం 134వ ఇన్నింగ్స్ లోనే ఈ మార్కును చేరుకున్నాడు. కింగ్ విరాట్ కోహ్లీకి మాత్రం ఈ మైలురాయిని చేర‌డానికి 167 ఇన్నింగ్స్ ప‌ట్టింది. 






అంపైర్ తో సంవాదం.. 
ఇక ఇదే మ్యాచ్ లో ఢిల్లీ బౌల‌ర్ కుల్దీప్ యాద‌వ్ దుకూడు ప్ర‌ద‌ర్శించాడు. త‌ను వేసిన తొలి బంతే సుద‌ర్శన్ ప్యాడ్ల‌కు తాక‌గా, ఔట్ కోసం గ‌ట్టిగా అప్పీల్ చేశాడు. అయితే దీనికి అంపైర్ ఔటివ్వ‌క‌పోవ‌డంతో అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. ఆ త‌ర్వాత రివ్యూ తీసుకోగా, అది అంపైర్ కాల్ గా రావ‌డంతో సుద‌ర్శ‌న్ బ‌తికి పోయాడు. దీంతో నాటౌట్ ఇచ్చినందుకు అంపైర్ తో కుల్దీప్ కాస్త గొడ‌వ‌పెట్టుకున్నాడు. మ్యాచ్ లో ఈ ఘ‌ట‌న కాస్త ఉత్కంఠ‌ను రేపింది. ఎంత‌మంది బౌల‌ర్లను మార్చిన గుజ‌రాత్ జ‌ట్టు వికెట్ ను తీయ‌క పోవ‌డంతో ఢిల్లీ ఆట‌గాళ్ల‌లో ఆ అన్ హేపీ నెస్ క‌నిపించింది. ఇక చావోరేవోలాంటి మ్యాచ్ లో ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 3 వికెట్ల‌కు 199 ప‌రుగులు చేసింది.