KL Rahul News:  జ‌ట్టుతో చేర‌నున్న టీమిండియా స్టార్.. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో తొలి మ్యాచ్ కు దూరం.. మ‌రింత ప‌టిష్టంగా ఢిల్లీ బ్యాటింగ్..

రాహుల్ సేవ‌లు తర్వాతి మ్యాచ్ నుంచి ఢిల్లీకి ల‌భించ బోతున్నాయి. ఈనెల 30న విశాఖ‌ప‌ట్నంలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో ఢిల్లీ త‌ల‌ప‌డ‌నుంది. ఇరుజ‌ట్లు ఈ సీజన్ లో తొలి మ్యాచ్ గెలిచి, జోరుమీదున్నాయి. 

Continues below advertisement

IPL 2025 DC VS SRH Updates: తొలి మ్యాచ్ లో గెలిచి జోరు మీదున్న ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు గుడ్ న్యూస్. ఆ జ‌ట్టు స్టార్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్ జ‌ట్టుతో చేరేందుకు సిద్ద‌మయ్యాడు. సోమ‌వారం ఢిల్లీ-ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ కు రాహుల్ దూర‌మ‌య్యాడు. అత‌ని భార్య సినీ న‌టి, ఆతియా షెట్టి ఆడ‌బిడ్డ‌కు సోమ‌వార‌మే జ‌న్మ‌నిచ్చింది. దీంతో స్పెష‌ల్ ప‌ర్మిష‌న్ తో తొలి మ్యాచ్ కు రాహుల్ దూర‌మ‌య్యాడు. ఆ మ్యాచ్ లో ల‌క్నోపై ఒక వికెట్ తేడాతో ఉత్కంఠ భ‌రిత విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇక రాహుల్ రాక‌తో ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డ‌ర్ మ‌రింత ప‌టిష్టం కానుంది. ఈనెల 30న విశాఖ‌ప‌ట్నంలో ఢిల్లీ ఆడ‌బోయే రెండో మ్యాచ్ కు రాహుల్ ఆడ‌నున్నాడు. ఈ మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో ఢిల్లీ ఆడ‌నుంది. ఇక రాహుల్ ప్రజెంట్ ఫామ్ భీక‌రంగా ఉంది. ఇటీవ‌ల ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీలో విశేషంగా రాణించిన రాహుల్, అత్య‌ధిక ప‌రుగులు సాధించిన బ్యాట‌ర్ల‌లో ఒక‌డు. 

Continues below advertisement

త‌న టార్గెట్ అదే..
వ‌న్డే, టెస్టు టీమ్ లో ప‌ర్మినెంట్ స్థానం సంపాదించిన రాహుల్, టీ20ల్లో మాత్రం స్థానం కోల్పోయాడు. ఐపీఎల్లో స‌త్తా చాటి తిరిగి జాతీయ జ‌ట్టులో త‌న స్థానాన్ని సంపాదించుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్నాడు. ఈక్ర‌మంలో ఐపీఎల్ త‌న‌కు మంచి అవ‌కాశంగా మారనుంది. ఢిల్లీ త‌ర‌పున స‌త్తా చాటితే, మ‌ళ్లీ జాతీయ టీ20 జ‌ట్టులో త‌ను స్థానం సంపాదించుకునే అవకాశ‌ముంది. ఇక క్యాపిట‌ల్స్ తో చేరడానికి ముందే ముంబైలో టీమిండియా స‌హాయ‌క కోచ్ అభిషేక్ నాయ‌ర్ మార్గ‌ద‌ర్శ‌కత్వంలో త‌ను సాధ‌న చేశాడు. 

సాధార‌ణ ప్లేయ‌ర్ గా..
ఇక ఈ సీజ‌న్ లో రాహుల్ కేవలం సాధార‌ణ ప్లేయ‌ర్ గా బ‌రిలోకి దిగనున్నాడు. గత మూడు సీజ‌న్ల‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ గా రాహుల్ సత్తా చాటాడు. ఆ జ‌ట్టు రెండుసార్లు ప్లే ఆఫ్స్ కు వెళ్లేందుకు త‌ను స‌హ‌క‌రించాడు. అయితే గ‌తేడాది ల‌క్నోను విడిచి పెట్టి, మెగావేలానికి వ‌చ్చిన రాహుల్ ను ఢిల్లీ రూ.12 కోట్లు వెచ్చించి, కొనుగోలు చేసింది. అయితే ఈ సీజ‌న్ లో కేవలం ప్లేయ‌ర్ గా రాహుల్ ఎలా ఆడుతాడో చూడాలి. నిజానికి రాహుల్ ను ఢిల్లీ కెప్టెన్ గా చేస్తార‌ని భావించినా, స్టార్ ఆల్ రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ ను సార‌థిగా నియ‌మించారు. అత‌ని డిప్యూటీగా ఫాఫ్ డుప్లెసిస్ ను నియ‌మించారు. 

Continues below advertisement