Lucknow Super Giants vs Kolkata Knight Riders: ఐపీఎల్ 2023 సీజన్ 67వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మొదట బ్యాటింగ్ చేయనుంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే రెండు జట్లకూ ఈ మ్యాచ్ కీలకం. లక్నో సూపర్ జెయింట్స్ టాప్ 2లోకి రావాలంటే కోల్‌కతాపై భారీ తేడాతో గెలవాల్సి ఉంది.
ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తన తుదిజట్టులో ఎలాంటి మార్పులూ చేయలేదు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం రెండు మార్పులు చేసింది. దీపక్ హుడా స్థానంలో కరణ్ శర్మ జట్టులోకి వచ్చాడు. అలాగే స్వప్నిల్ స్థానంలో కృష్ణప్ప గౌతంకు తుది జట్టులో స్థానం దక్కింది.
లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), కరణ్ శర్మ, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా (కెప్టెన్), ఆయుష్ బదోని, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్
లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
సుయాష్ శర్మ, మన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, ఎన్ జగదీశన్, డేవిడ్ వైస్
కోల్‌కతా నైట్‌రైడర్స్ తుది జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
మతీషా పతిరనా, మిచెల్ సాంట్నర్, సుభ్రాంశు సేనాపతి, షేక్ రషీద్, ఆకాష్ సింగ్
ఐపీఎల్- 16 లో భాగంగా ఇటీవలే ముంబై ఇండియన్స్‌తో కీలక మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోకి వచ్చిన లక్నో.. 13 మ్యాచ్ లలో ఏడు గెలిచి 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. అయితే ఆ జట్టు ఈ మ్యాచ్ లో ఓడితే ఫోర్త్ ప్లేస్‌లోకి పడిపోయే ప్రమాదం ఉంది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. 14 పాయింట్లతో ఉంది. బెంగళూరు చివరి మ్యాచ్ లో గుజరాత్ ను ఓడిస్తే అప్పుడు ఆ జట్టు 16 పాయింట్లకు చేరి.. ముంబై (14 పాయింట్లు) కూడా హైదరాబాద్ ను ఓడిస్తే ఆ జట్టుకు కూడా 16 పాయింట్లు వస్తే అప్పుడు లక్నో.. ఐదో స్థానానికి పడిపోయే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్ లో ఈ డ్రామా అంతటికీ ముగింపు పలికేందుకు కృనాల్ పాండ్యా అండ్ గ్యాంగ్ సిద్ధమైంది.
ఈ సీజన్‌లో కేకేఆర్.. 13 మ్యాచ్ లలో ఆరు గెలిచి ఏడింట్లో ఓడి 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఆ జట్టుకు ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గగనమే అయినా అధికారికంగా నిష్క్రమించలేదు. నేటి మ్యాచ్ లో గెలిచినా ఆ జట్టుకు 14 పాయింట్లే వస్తాయి. ప్రస్తుతానికి ఆ జట్టు నెట్ రన్ రేట్ ( -0.256) కూడా మైనస్ లలోనే ఉంది. ఈ మ్యాచ్ లో కేకేఆర్.. లక్నో చేతిలో 103 పరుగుల తేడాతో ఓడితే అధికారికంగా నిష్క్రమించే ప్రమాదం ఉంది. ఎటు చూసినా కేకేఆర్‌కు ఇబ్బందే ఉన్నా గెలిస్తే మాత్రం ఆ జట్టు పాయింట్ల పట్టికలో తన ప్లేస్‌ను కాస్త మెరుగుపరుచుకోవచ్చు.