Jack Fraser Mc Gruk Half Century : ఫస్ట్ ఇన్నింగ్స్ లో 160 పరుగులు కొడితే ఎప్పుడూ ఓడిపోని లక్నో...ఆస్ట్రేలియా బుడ్డోడు జేక్ ఫ్రెజర్ కొట్టుడుకు ఓడిపోవాల్సి వచ్చింది. 22 ఏళ్ల ఈ కుర్రాడు ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే దుమ్ముదులిపాడు. మనోడు చూడటానికి సన్నగా ఉన్నప్పటికీ..షాట్స్ మాత్రం బలంగా కొడుతున్నాడు. బౌలర్ ఎంత స్పీడుగా బాల్ వేస్తే.. అంతే స్పీడుగా బౌండరీకి పంపుతున్నాడు.
ముఖ్యంగా కృణల్ పాండ్య ఓవర్ లో 3 సిక్సులు కొట్టడం మొత్తం మ్యాచ్ నే టర్న్ తిప్పింది. అలా.. కేవలం 35 బాల్స్ లోనే 5 సిక్సులు,2 ఫోర్లతో55 రన్స్ కొట్టాడు. ఈ ఇన్నింగ్స్ కాదు..మనోడిపై ఇంకా రెండు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అవేంటంటే..! లిస్ట్-A క్రికెట్ లో ప్రపంచంలోనే అత్యంత ఫాసెస్ట్ సెంచరీ కొట్టి AB డెవిలియర్స్ రికార్డు బద్దలు కొట్టాడు. కేవలం 29 బాల్స్ లోనే 100 పరుగులు కొట్టాడు. ఇక ప్రొఫెషనల్ క్రికెట్ లో టీ20లో కేవలం 30 బాల్స్ లోనే సెంచరీ కొట్టి గేల్ రికార్డును కూడా లేపేశాడు. 2020-21 బిగ్ బాష్ లీగ్ లో అరంగేట్రం చేశాడు. ఇప్పుడు ఐపీఎల్ లోనూ అరంగేట్రంతో దుమ్ముదులిపాడు. జాక్ ఇదే ఫామ్ ని కొనసాగిస్తే..దిల్లీకి తిరుగుండదు.
శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్‌లో సంచలనాలు నమోదు అయ్యాయి. జోరు మీద ఉన్న ఎల్ఎస్‌హెచ్‌కు ఢిల్లీ షాక్ ఇచ్చింది. దాదాపు రెండు ఓవర్లు ఉండగానే 167 పరుగుల లక్ష్యాన్ని డీసీ ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నోను ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ ఫీల్డింగ్‌తో కట్టడి చేశారు. అయినా ఓపెనర్లు చాలా స్పీడ్‌గా ఆడారు. రాహుల్ ఉన్నంత వరకు ఆ జట్టు బ్యాటింగ్ పటిష్టంగానే ఉన్నట్టు కనిపించింది. 39 పరుగులు వద్ద రాహుల్‌ను కులదీప్ యాదవ్ ఔట్ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆఖరిలో ఆయుష్ బదోని ధాటిగా ఆడటంో పోరాడే స్కోరును లక్నోకు అందించాడు.
168 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ ఆది నుంచి చాలా స్పీడ్‌గా ఆడింది. మొదటి వికెట్ త్వరగా తీసినా పృథ్వీ షా, జేక్ ఫ్రెసర్ మెక్‌గర్క్ జోరును అడ్డుకోలేకపోయారు. ఏడో ఓవర్‌లో పృథ్వీ అవుటైనప్పటికీ మెక్‌గర్క్ స్పీడ్‌కు బ్రేక్‌లు పడలేదు. 13 ఓవర్లు కంప్లీట్ అయ్యేటప్పటికి మ్యాచ్‌ను ఢిల్లీ చేతుల్లోకి వచ్చేసింది. మెక్‌గర్క్ 35 బంతుల్లో 55 పరుగులు చేసి నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ ఆ జోరు కొనసాగించారు. 24 బంతుల్లో 41 పరుగులు చేశారు. చివర్‌లో స్టబ్స్, హోప్స్ విజయానికి చేరువ చేశారు.