IPL 2026 Mini Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కోసం మంగళవారం మధ్యాహ్నం రెండున్నరకు అబుదాబిలోని ఎతిహాద్ అరేనాలో మినీ వేలం ప్రారంభమైంది. IPL ప్రారంభంలో వేలం నిర్వహించే బాధ్యతను రిచర్డ్ మెడ్లీ నిర్వహించేవారు. ఆ తర్వాత హ్యూగ్ ఎడ్మెడ్స్ వచ్చారు. కొంతకాలం ఆయన నిర్వహించారు. ఆ తర్వాత చారు శర్మ కూడా ఈ బాధ్యతను కొన్నాళ్లు స్వీకరించారు. కానీ ఐపీఎల్ 2024 నుండి మల్లికా సాగర్ ఐపీఎల్ వేలం నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా IPL 2026 మినీ వేలంలో 369 మంది ఆటగాళ్ల వేలం నిర్వహించే బాధ్యత మల్లికా సాగర్ స్వీకరించారు.
వేలం నిర్వాహకురాలిగా మల్లికా ఎలా మారారు..
మల్లికా సాగర్ ప్రస్తుతం IPL వేలంలో ఒక ముఖ్యమైన భాగం అయ్యారు. అయితే ఆమె ఈ స్థాయికి చేరుకోవడానికి ఒక ప్రత్యేకమైన, చారిత్రాత్మక ప్రయాణం ఉంది. 1975లో ముంబైలో జన్మించిన మల్లికా సాగర్ రెండు వేర్వేరు ప్రపంచాలను కలిపే రంగంలో తన వృత్తిని ప్రారంభించారు. అవి: ఫైన్ ఆర్ట్, పెద్ద క్రీడా కార్యక్రమాల వేలం.
మల్లికా ఒక వ్యాపార కుటుంబానికి చెందినవారు. ఆమెకు వేలంపై ఆసక్తి ఒక పుస్తకం ద్వారా ప్రారంభమైంది. ఇందులో ఒక మహిళా వేలం నిర్వాహకురాలు ప్రధాన పాత్ర పోషించారు. ఫిలడెల్ఫియాలోని బ్రిన్ మార్ కళాశాల నుండి ఆర్ట్ హిస్టరీలో మల్లికా సాగర్ డిగ్రీ పొందారు. కేవలం 26 సంవత్సరాల వయస్సులో మల్లికా న్యూయార్క్‌లోని క్రిస్టీస్‌లో మొదటి భారత మహిళా వేలం నిర్వాహకురాలిగా మారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వేలం మార్కెట్‌లో ఆమెకు గుర్తింపు తెచ్చిన ఒక గొప్ప కార్యక్రమం.
మొదటి భారత మహిళా వేలం నిర్వాహకురాలు మల్లికా
2021లో మల్లికా సాగర్ ప్రో కబడ్డీ లీగ్‌లో మొదటి మహిళా వేలం నిర్వాహకురాలిగా మరో విజయం సాధించారు. రెండేళ్ల తర్వాత, ఆమెకు మొదటిసారి మహిళల ప్రీమియర్ లీగ్ వేలం నిర్వహించే బాధ్యత దక్కింది. ఆమె IPL 2024 మినీ వేలం, సౌదీ అరేబియాలోని జెద్దాలో జరిగిన IPL 2025 మెగా వేలం కూడా నిర్వహించారు. గత నెలలో నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో కూడా మల్లికా సాగర్ వేలం నిర్వహించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇలాంటి బాధ్యతలు దక్కడంసైతం అంత ఆమామాషీ కాదు.