Rishabh Pant IPL Auction 2025: అంచనాలు నిజమయ్యాయి. ఐపీఎల్( IPL) చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా విధ్వంసకర వీరుడు .. రిషభ్ పంత్(Rishabh Pant) చరిత్ర సృష్టించాడు. గత రికార్డులన్నింటినీ కాలగర్భంలో కలిపేస్తూ... ఐపీఎల్ చరిత్రలో పంత్ రికార్డు నెలకొల్పాడు. రూ. 27 కోట్లకు పంత్‌ను లక్నో(Lucknow Super Giants) దక్కించుకుంది. ఈ ధర పలకడంతో క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. పంత్ కోసం ప్రాంచైజీలు హోరాహోరీగా పోటీ పడ్డాయి. పంత్ మాకంటే మాకంటూ ధరను పెంచేస్తూ పోయాయి. చివరకు రూ. 27 కోట్లకు పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. బేస్ ప్రైస్ రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చిన పంత్‌.. భారీ ధర పలుకుతుందని మొదటినుంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను నిజం చేస్తూ పంత్ భారీ ధర పలికాడు.









 

ఘోర రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని.. అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసిన పంత్... తన విధ్వంసకర ఆటతీరుతో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలోనూ స్థిరంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. లక్నో, ఆర్సీబీ పంత్ కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. వీరిద్దరిలో ఎవరూ తగ్గకపోవడంతో పంత్ ధర పెరుగుతూ పోయింది.  మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రంగంలోకి వచ్చింది. సన్‌రైజర్స్  కావ్య పాప.. పంత్ ధరను అమాంతం పెంచేస్తూ పోయింది.  చివరికి 20.75 కోట్ల నుంచి పంత్‌ ధరను లక్నో 27 కోట్లకు పెంచేసింది. దీంతో మిగిలిన ప్రాంచైజీలు బిడ్‌ దాఖలు చేసే సాహసం చేయలేదు. దీంతో పంత్‌ లక్నో సొంతమ‌య్యాడు.

 

భీకర ఫామ్‌లో పంత్

రిషభ్ పంత్ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. పంత్‌కు ఐపీఎల్‌లో  మంచి రికార్డు ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటివ‌ర‌కు 111 మ్యాచ్‌లు ఆడిన పంత్.. 148.93 స్ట్రైక్ రేట్‌తో 3284 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పంత్ 13 మ్యాచ్‌ల్లో 40 సగటుతో 446 పరుగులు చేశాడు.

 

పంత్ తరువాత కనీస ధర రూ. 2కోట్లు ఉన్న మహ్మద్‌ షమిని రూ.10 కోట్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ దక్కించుకుంది. ఇక సౌతాఫ్రికా హిట్టర్ డేవిడ్ మిల్లర్‌ను రూ.7.5 కోట్లకు లఖ్‌నవూ సొంతం చేసుకుంది.


 

యుజ్వేంద్ర చాహల్‌కు రూ. 18 కోట్లు
 స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ ను దక్కించుకునేందుకు పంజాబ్‌ సూపర్‌ కింగ్స్‌, లక్నో సూపర్ జెయింట్స్‌ తీవ్రంగా పోటీ పడ్డాయి.  ఎవరూ తగ్గకపోవడంతో చాహల్‌ ధర అమాంతం పెరుగుతూ పోయింది. తొలుత అర్ష్‌దీప్  కోసం పంజాబ్‌, ఆర్సీబీ పోటీ పడగా అప్పటికే ధర రూ. 10 కోట్లు దాటింది.





ఆ సమయంలో ఎంట్రీ ఇచ్చిన సన్‌ రైజర్స్‌ ధర పెంచుతూ పోయింది, పంజాబ్‌ కూడా ఎక్కడ తగ్గకపోవడంతో ధ‍ర ఆకాశాన్ని తాకుతూ పోయింది. చివరికి చాహల్‌ను పంజాబ్‌ రూ. 18 కోట్లకు దక్కించుకుంది.