IPL Final, RR vs GT Fantasy 11:  ఐపీఎల్‌ 2022 ఆఖరి మ్యాచ్‌ మరికొన్ని గంటల్లో మొదలవుతోంది. గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ట్రోఫీ అందుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. అదే సమయంలో ఫాంటసీ ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఎవరెవరిని తీసుకుంటే బాగుంటుందోనని అభిమానులు ఆలోచిస్తున్నారు. పిచ్‌ ఎలా ఉండబోతోంది? అంచనా జట్లు ఎలా ఉంటాయి? ఫాంటసీ ఎలెవన్‌లో ఎవరిని తీసుకుంటే బాగుంటుందో మీ కోసం!


పిచ్‌ రిపోర్ట్‌


మొతేరాలో జరిగిన రెండో క్వాలిఫయర్‌ పోరులో బ్యాటర్లు మోస్తరుగా రాణించారు. ఆ మ్యాచులో పడ్డ 11లో 9 వికెట్లను పేసర్లే తీశారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేయడం సులువుగా అనిపించింది. బంతి చక్కగా బ్యాటు మీదకు వచ్చింది. అంటే టాస్‌ కీలకం అవుతుంది. గెలిస్తే మొదట ఫీల్డింగ్‌ ఎంచుకోవడం ఉత్తమం. పిచ్‌ అటు పేసర్లు, స్పిన్నర్లకు అనుకూలిస్తుంది.


Gujarat Titans vs Rajasthan Royals Probable XI


రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వీ జైశ్వాల్‌, జోస్‌ బట్లర్‌, సంజు శాంసన్‌, దేవదత్‌ పడిక్కల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, రియాన్‌ పరాగ్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్‌, ఒబెడ్‌ మెక్‌కాయ్‌


గుజరాత్‌ టైటాన్స్‌: వృద్ధిమాన్‌ సాహా, శుభ్‌మన్ గిల్‌, మాథ్యూవేడ్‌, హార్దిక్‌ పాండ్య, డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాతియా, రషీద్‌ ఖాన్‌, సాయి కిషోర్‌, యశ్‌ దయాల్‌, లాకీ ఫెర్గూసన్‌/ అల్జారీ జోసెఫ్‌, మహ్మద్‌ షమి


ఫాంటసీ పిక్స్‌!


ఫాంటసీ ఎలెవన్‌ విషయానికి వస్తే జోస్‌ బట్లర్‌, సంజు శాంసన్‌ను వికెట్‌ కీపర్లుగా తీసుకోవాలి. మంచి ఫామ్‌లో ఉన్న బట్లర్‌కు కెప్టెన్సీ ఇవ్వాలి. బ్యాటర్ల కోటాలో డేవిడ్‌ మిల్లర్‌, శుభ్‌మన్‌ గిల్‌, యశస్వీ జైశ్వాల్‌కు ఛాన్స్‌ ఇవ్వాలి. ఆల్‌రౌండర్ల కోటాలో అశ్విన్‌, హార్దిక్‌ పాండ్య వస్తారు. హార్దిక్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంచుకుంటే బ్యాటింగ్‌, బౌలింగ్‌లో పాయింట్లు వస్తాయి. బౌలర్ల విభాగంలో యుజ్వేంద్ర చాహల్‌, మహ్మద్‌ షమి, ప్రసిద్ధ్‌ కృష్ణ, రషీద్‌ ఖాన్‌ను తీసుకుంటే బెటర్‌. ఈ సీజన్లో బట్లర్‌ ఇప్పటికే 824 పరుగులు చేశాడు. ఇంకా చేసే అవకాశం ఉంది. యుజ్వేంద్ర చాహల్‌ 26 వికెట్లతో ముందున్నాడు. సంజు శాంసన్‌ 444 రన్స్‌, హార్దిక్‌ పాండ్య 453 రన్స్‌, రషీద్‌ ఖాన్‌ 18 వికెట్లు సాధించారు.


టైటాన్స్‌దే అప్పర్‌ హ్యాండ్‌


ఈ సీజన్లో అస్సలు అంచనాల్లేకుండా బరిలోకి దిగింది గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Titans)! హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) కెప్టెన్సీపై అసలెవ్వరికీ నమ్మకం లేదు. టాప్‌ ఆర్డర్లో శుభ్‌మన్‌ గిల్‌ తప్పితే స్టార్లు, యువకుల్లేరు. పేపర్‌పైన చూస్తే అన్ని బేసెస్ కవర్‌ చేసినట్టే అనిపించలేదు. అండర్‌ డాగ్‌గా వచ్చిన ఆ జట్టు వరుస విజయాలతో ఫైనల్‌ చేరుకోవడం అద్భుతమే! మరోవైపు రాజస్థాన్‌ రాయల్స్‌ చక్కని జట్టును ఎంపిక చేసింది. వేలంలో విలువైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. 'ఫరెవర్‌ ఫస్ట్‌ రాయల్‌' షేన్‌ వార్న్‌కు ట్రోఫీతో నివాళి అర్పించాలని కంకణం కట్టుకుంది. ఫైనల్‌ చేరుకుంది. ఈ రెండు జట్లలో ఇప్పటికైతే 2-0తో హార్దిక్‌ సేనదే పైచేయి! లీగ్‌ మ్యాచులో హార్దిక్‌ 87, 1/18తో రెచ్చిపోయాడు. క్వాలిఫయర్‌ 1లో డేవిడ్‌ మిల్లర్‌ (David Miller) హ్యాట్రిక్‌ సిక్సర్లతో రెండో ఓటమి రుచిచూపించాడు.