IPL Brand Valuation Surges To Record High:  గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ హూలీహాన్ లోకీ రిలీజ్ చేసిన 2026 ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూయేషన్ స్టడీలో మైండ్ బ్లాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL) బిజినెస్ ఎంటర్‌ప్రైజ్ వ్యాల్యూ ఇయర్-ఆన్-ఇయర్ 11.4 పర్సెంట్ పెరిగి ఏకంగా 20.6 బిలియన్ డాలర్లకు (రూ. 1,97,024.68 కోట్లు) రీచ్ అయింది. లీగ్ స్టాండ్ ఎలోన్ బ్రాండ్ వ్యాల్యూ కూడా 10.3 పర్సెంట్ పెరిగి 4.3 బిలియన్ డాలర్లకు (రూ. 41,106 కోట్లు) చేరింది. పర్-మ్యాచ్ వ్యాల్యూయేషన్ లో ఎన్‌ఎఫ్‌ఎల్ (NFL) తర్వాత వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ స్పోర్ట్స్ ప్రాపర్టీగా ఐపీఎల్ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.

Continues below advertisement

Continues below advertisement

ఫ్రాంచైజీల కొనుగోలులో రికార్డు డీల్స్.. ఆర్సీబీ రేటు 1.78 బిలియన్ డాలర్లు2026 సీజన్ లో ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్ షిప్స్ లో బిగ్ చేంజెస్ వచ్చాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ను బ్లాక్‌స్టోన్, బోల్ట్ వెంచర్స్, ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ కాన్సార్టియం ఏకంగా 1.78 బిలియన్ డాలర్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది. మిట్టల్ ఫ్యామిలీ, ఆదార్ పూనావాలాలు రాజస్థాన్ రాయల్స్ (RR) ను 1.65 బిలియన్ డాలర్ల వ్యాల్యూయేషన్ తో కొనుగోలు చేశారు. "ఐపీఎల్ కి ఉన్న ఆడియన్స్ రీచ్, రెవెన్యూ మోడల్ పై ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగింది" అని హూలీహాన్ లోకీ డైరెక్టర్ హర్ష్ తాలికోటి వెల్లడించాడు. డిజిటల్ వ్యూవర్ షిప్ గ్రోత్ పెరగడం వల్ల జియోస్టార్ లో 1.06 బిలియన్ స్క్రీన్స్ రీచ్ నమోదు కాగా, లీగ్ టోటల్ రెవెన్యూ 1.8 బిలియన్ డాలర్లు దాటింది.

ఆర్సీబీ నంబర్ వన్ పొజిషన్.. $300 మిలియన్ దాటిన ఫస్ట్ టీమ్టీమ్‌ల బ్రాండ్ వ్యాల్యూలో ఆర్సీబీ $312.0 మిలియన్ల వ్యాల్యూతో నంబర్ వన్ ప్లేస్ ని నిలబెట్టుకుంది. $300 మిలియన్ల మార్క్ దాటిన ఫస్ట్ క్రికెట్ టీమ్ గా ఆర్సీబీ రికార్డ్ సృష్టించింది. ఆ తర్వాత స్థానాల్లో ముంబై ఇండియన్స్ ($264.0M) సెకండ్ ప్లేస్ లో, కోల్‌కతా నైట్ రైడర్స్ ($245.0M) థర్డ్ ప్లేస్ లో నిలిచాయి. చెన్నై సూపర్ కింగ్స్ ($244.0M) ఫోర్త్ ప్లేస్ కి పరిమితమైంది. ఎంఎస్ ధోని ఆన్-ఫీల్డ్ రోల్ తగ్గడం, వరుసగా సెకండ్ సీజన్ లో పూర్ పర్ఫార్మెన్స్ చూపించడం వల్ల సీఎస్‌కే మోమెంటమ్ కొద్దిగా తగ్గింది. 

మిగతా ఫ్రాంచైజీల ర్యాంకింగ్స్ వివరాలుమిగతా టీమ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5వ స్థానంలో ($168.0M), రాజస్థాన్ రాయల్స్ 6వ స్థానంలో ($161.0M), పంజాబ్ కింగ్స్ 7వ స్థానంలో ($158.0M), గుజరాత్ టైటాన్స్ 8వ స్థానంలో ($157.0M), ఢిల్లీ క్యాపిటల్స్ 9వ స్థానంలో ($156.0M), లక్నో సూపర్ జెయింట్స్ 10వ స్థానంలో ($122.0M) నిలిచాయి.