IPL All Time XI Rohit Sharma Left Out | ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా భావించే రోహిత్ శర్మ గురించి ఒక ఆశ్చర్యకరమైన చర్చ నడుస్తోంది. 5 సార్లు ముంబై ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్‌కు ఐపీఎల్ ఆల్-టైమ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. ఈ జట్టును ఎవరో కాదు, ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడు క్రిస్ జోర్డాన్ ఎంపిక చేశాడు. అతను రోహిత్ శర్మ కెప్టెన్సీలో పలు మ్యాచ్‌లు ఆడాడు. అందుకే అతడి నిర్ణయం అభిమానులకు మరింత ఆశ్చర్యం కలిగించింది.

Continues below advertisement

ఇంగ్లాండ్ కు చెందిన ఆల్ రౌండర్ క్రిస్ జోర్డాన్ ఎంపిక చేసిన ఈ ఆల్-టైమ్ XIలో రోహిత్ శర్మ మాత్రమే కాకుండా, ముంబై ఇండియన్స్ దిగ్గజ ఆల్-రౌండర్ కీరన్ పొలార్డ్‌ను కూడా పక్కన పెట్టాడు. పొలార్డ్‌ను ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్లలో ఒకరిగా భావిస్తారు. అలాంటిది రోహిత్‌తో పాటు పోలార్డ్ పేరు లేకపోవడం కూడా హాట్ టాపిక్ అవుతోంది.

ఓపెనింగ్‌లో కోహ్లీ, గేల్‌పై నమ్మకం

Continues below advertisement

జోర్డాన్ తన ఐపీఎల్ ఆల్ టైమ్ జట్టు ఓపెనింగ్ జోడీగా విరాట్ కోహ్లీ, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌ను ఎంచుకున్నాడు. విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్. ప్రస్తుత ఐపీఎల్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఓపెనింగ్ చేశాడు. క్రిస్ గేల్‌ను టీ20 క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా చెబుతారు. అతను ఐపీఎల్‌లో అనేక గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌లు ఆడాడు.

మిడిల్ ఆర్డర్‌లో జోర్డాన్.. మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్, సురేష్ రైనా, సూర్యకుమార్ యాదవ్‌లను చేర్చాడు. ఏబీ డివిలియర్స్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే సురేష్ రైనాను "మిస్టర్ ఐపీఎల్" అని పిలుస్తారు. సూర్యకుమార్ యాదవ్ ఇటీవలి సంవత్సరాలలో టీ20 క్రికెట్‌లో అత్యంత నమ్మకమైన బ్యాటర్లలో ఒకరిగా నిలిచాడు.

కెప్టెన్‌గా ధోనీ

వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనీని ఎంచుకున్నారు. జట్టు కెప్టెన్సీని కూడా అతనికి అప్పగించాడు. ధోనీ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు 5 సార్లు టైటిల్స్ అందించాడు.

ఆల్-రౌండర్ల పాత్రను హార్దిక్ పాండ్యా, సునీల్ నరేన్‌లకు అప్పగించాడు. వీరిద్దరూ బ్యాటింగ్, బౌలింగ్‌తో ఐపీఎల్‌లో అనేక మ్యాచ్‌లను గెలిపించారు. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. బుమ్రా,  మలింగలను ఐపీఎల్‌లో అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్‌లుగా జోర్డాన్ భావిస్తున్నాడు. అయితే చాహల్ తన స్పిన్ మాయాజాలంతో వికెట్లు తీసే స్పిన్నర్‌గా ఉన్నాడు.

రోహిత్ ఇప్పటివరకు రికార్డు

రోహిత్ శర్మ ఐపీఎల్‌లో 7000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అతని పేరు మీద 2 సెంచరీలు, 47 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో అతని సగటు 29.73గా ఉంది. అంతేకాకుండా హిట్ మ్యాన్ ఐపీఎల్ చరిత్రలో 302 సిక్సర్లు, 640 ఫోర్లు కూడా కొట్టాడు.

జోర్డాన్ ఐపీఎల్ ఆల్-టైమ్ 11

విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, సురేష్ రైనా, సూర్యకుమార్ యాదవ్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), ఏబీ డివిలియర్స్, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, సునీల్ నరైన్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ.