Yuzvendra Chahal Vaping Controversy in Flight: ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో పంజాబ్ కింగ్స్ (PBKS) వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఒక నెగటివ్ న్యూస్ తో హెడ్ లైన్స్ లోకి వచ్చాడు. విమాన ప్రయాణంలో చాహల్ వాపింగ్ (Vaping) చేస్తూ కనిపించాడనే వార్త ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పంజాబ్ టీమ్ సభ్యులు అహ్మదాబాద్ నుండి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ ఇన్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు, ఫోటోలు చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
వ్లాగ్ ద్వారా బయటపడ్డ నిజం..నిజానికి ఈ విషయం బయటకు రావడానికి టీమ్ మేట్ అర్ష్‌దీప్ సింగ్ కారణమయ్యాడు. అతను షూట్ చేసిన ఒక వ్లాగ్‌లో చాహల్ ఇ-సిగరెట్ వాడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పక్కనే శశాంక్ సింగ్ వంటి ఇతర ప్లేయర్లు కూడా ఉన్నారు. అయితే ఈ వీడియో వైరల్ అవ్వగానే, పంజాబ్ కింగ్స్ యాజమాన్యం లేదా అర్ష్‌దీప్ సింగ్ ఆ వీడియోను ఎడిట్ చేసి, చాహల్ ఉన్న సీన్లను కట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశారని నెటిజన్లు స్క్రీన్ షాట్లతో సహా నిరూపిస్తున్నారు. విమానంలో ఇలాంటి పనులు చేయడం తోటి ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించడమేనని సోషల్ మీడియా యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మళ్ళీ రిపీట్ అయిన వాపింగ్ గొడవ..ఐపీఎల్ 2026లో వాపింగ్ వివాదం రావడం ఇది రెండోసారి. కొన్ని రోజుల క్రితమే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్, పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లో వాపింగ్ చేస్తూ కెమెరాకు చిక్కాడు. ఆ విషయంలో బీసీసీఐ సీరియస్ అయ్యి, పరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. ఇప్పుడు చాహల్ కూడా అదే తరహాలో దొరికిపోవడంతో క్రమశిక్షణపై చర్చ మొదలైంది.
అశ్విన్ సీరియస్ అడ్వైస్..ఈ వివాదాలపై టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందించాడు. ముఖ్యంగా రియాన్ పరాగ్ ఇన్సిడెంట్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇలాంటివి కెరీర్ కు అస్సలు మంచిది కాదని అన్నాడు. మీ పర్సనల్ లైఫ్ లో ఏం చేసినా ఎవరికీ అభ్యంతరం ఉండదని, కానీ ఒక పబ్లిక్ స్పేస్ లో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఒక టీమ్ కు లీడర్ గా, ఎంతో మంది యువతకు ఇన్‌స్పిరేషన్ గా ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలని హితవు పలికాడు. ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్ల మొత్తం ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందని అశ్విన్ హెచ్చరించాడు.
చాహల్ పై చర్యలు ఉంటాయా?ప్రస్తుతానికి ఈ వీడియోపై పంజాబ్ కింగ్స్ టీమ్ గానీ, చాహల్ గానీ ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. విమానాల్లో స్మోకింగ్ లేదా వాపింగ్ చేయడం చట్టరీత్యా నేరం. మరి దీనిపై విమానయాన సంస్థ లేదా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో వేచి చూడాలి. ప్లేయర్లు మైదానంలోనే కాకుండా బయట కూడా స్పోర్ట్స్ మన్ స్పిరిట్ తో మెలగాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
