Royal Challengers Bengaluru vs Delhi Capitals Scorecard: ఢిల్లీ క్యాపిటల్స్‌తో సొంత వేదిక బెంగళూరులో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు రాణించారు. కఠినమైన పిచ్ కండీషన్‌లో ఆర్సీబీ బ్యాటర్లు 180 పరుగులు చేసి ప్రత్యర్థి జట్టుకు మోస్తరు టార్గెట్ ఇచ్చారు. చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు జట్టు గత 6 మ్యాచ్‌లలో ఒక్కటి కూడా ఓడలేదు. తాజా మ్యాచులో బెంగళూరు ఆటగాళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్ కేవలం 26 పరుగులు చేశాడు. అయితే ఒక చారిత్రాత్మక రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు, ఫిల్ సాల్ట్ ఒక బలమైన అర్ధ సెంచరీ సాధించాడు, కానీ రన్ మేషిన్ విరాట్ కోహ్లీ ఫ్లాప్ అయ్యాడు.

Continues below advertisement

టిమ్ డేవిడ్ చరిత్ర, సాల్ట్ విధ్వంసం

టిమ్ డేవిడ్ ఈ మ్యాచ్‌లో 17 బంతులు ఆడి 26 పరుగులు మాత్రమే చేశాడు. తన IPL కెరీర్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. బంతుల పరంగా టిమ్ డేవిడ్ IPLలో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన 2వ బ్యాటర్‌గా నిలిచాడు. డేవిడ్ 560 బంతుల్లో 1000 పరుగులు పూర్తి చేశాడు.

ఆర్సీబీ బ్యాటర్ కంటే ముందు 545 బంతుల్లో వెయ్యి పరుగులు ఆండ్రీ రస్సెల్ ఉన్నాడు. ట్రావిస్ హెడ్ 575 బంతుల్లోనే వెయ్యి పరుగులు చేయగా.. ఫిల్ సాల్ట్ సైతం 575 బంతుల్లో, హెన్రిచ్ క్లాసెన్ 594 బంతుల్లో 1000 రన్స్ సాధించి టాప్ 5 లో నిలిచారు.

Continues below advertisement

ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసం సృష్టించాడు. 38 బంతుల్లో 63 పరుగులతో అర్ధ సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ కేవలం 19 పరుగులు, 18 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రజత్ పాటిదార్ కూడా త్వరగా ఔటయ్యాడు. కెప్టెన్ పాటిదార్ కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు.

చివరి 7 ఓవర్లలో 45 పరుగులు

ఒకానొక స్టేజీలో RCB 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 పరుగులతో ఉంది. భారీ స్కోరు ఖాయమని భావిస్తున్న సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు విజృంభించారు. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చివరి 7 ఓవర్లలో బెంగళూరు జట్టు కేవలం 45 పరుగులు మాత్రమే చేయగలిగింది. అదే సమయంలో 4 వికెట్లు కూడా కోల్పోవడంతో బెంగళూరు జట్టు 200 పరుగులు మార్క్ దాటలేకపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు కెప్టెన్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి తలో 2 వికెట్లు తీశారు. ముఖేష్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు.