SRH vs LSG 2025: హైదరాబాద్ వేదికగా లక్నోతో ఆడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోయింది. గత రికార్డులను చూసిన అభిమానులు ఈసారి కచ్చితంగా 300 పరుగుల రికార్డు బ్రేక్ అవుతుందని అనుకున్నారు. అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్నట్టు మారిపోయింది సీన్. ఆదిలోనే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌గా పెద్ద వికెట్లు మూడవ ఓవర్‌లోనే కోల్పోయింది. వీళ్లిద్దరు శార్దూల్ ఠాకూర్ ఓవర్‌లో వరుస 2 బంతులకు అవుటయ్యారు. ఆ తరువాత ట్రావిస్ హెడ్ కొన్ని మంచి షాట్లు కొట్టి ఒత్తిడిని కొంతవరకు తగ్గించాడు. హెడ్ 47 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అతన్ని 8వ ఓవర్‌లో ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన బంతితో బౌల్డ్ చేశాడు.
ట్రావిస్ హెడ్ 47 పరుగులతో ధాటిగా ఆడుతున్న టైంలో ప్రిన్స్ యాదవ్‌కు పంత్ బాల్ ఇచ్చాడు. అనుకున్నట్టుగానే 8వ ఓవర్‌లో హైదరాబాద్‌కు షాక్ ఇచ్చాడు. మూడవ బంతిలో అ అద్భుతం చేశాడు. బ్రహ్మాండమైన యార్కర్ బంతితో హెడ్‌ను బోల్తాకొట్టించాడు. బంతి వికెట్‌ను పడగొట్టింది. 28 బంతుల్లో ఆడిన ఈ ఇన్నింగ్స్‌లో హెడ్ 3 సిక్స్‌లు, 5 ఫోర్లు కొట్టాడు.
వరుస సిక్సర్లతో అల్లాడిస్తున్న క్లాసెన్ కూడా ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లోనే రన్ అవుట్ అయ్యాడు. 17 బంతుల్లో 26 పరుగులు చేసి దురదృష్టవశాత్తు డగౌట్‌కు చేరుకున్నాడు. దీంతో క్లాసెన్ ముఖంలో నిరాశ నిండుకుంది.
12వ ఓవర్‌లో చివరి బంతికి నితిష్ రెడ్డి షాట్ కొట్టాడు. కానీ బంతి బౌలర్ ప్రిన్స్ యాదవ్ చేతికి తగిలి నాన్-స్ట్రైకింగ్ ఎండ్‌లో స్టంప్స్‌ను ఢీకొట్టింది. హెన్రిక్ క్లాసెన్ క్రీజ్ బయట ఉన్నాడు. ఈ వికెట్ పడటానికి ముందు క్లాసెన్ నితీష్ రెడ్డి మధ్య 34 పరుగుల భాగస్వామ్యం ఉంది.
ప్రిన్స్ యాదవ్ గాయపడ్డాడా?హెన్రిక్ క్లాసెన్ వికెట్ పడిన తర్వాత ప్రిన్స్ యాదవ్ నొప్పితో అరుస్తూ కనిపించాడు. దీంతో మెడికల్ స్టాఫ్ మైదానంలోకి వచ్చింది. లక్నో జట్టులో మయంక్ యాదవ్, ఆకాశ్‌దీప్ ఇప్పటికే గాయపడ్డారు. తర్వాత నార్మల్‌గానే బౌలింగ్ చేశాడు. SRHతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్ల స్పెల్ పూర్తి చేసి 29 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎక్కువ మంది బ్యాట్స్‌మెన్ పెద్ద స్కోర్ చేయకపోయినా, LSGతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 190 పరుగులు చేయగలిగింది.
టీ20లో హ్యాట్రిక్ తీసుకున్న ప్రిన్స్ యాదవ్
ప్రిన్స్ యాదవ్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో హ్యాట్రిక్ తీసుకున్న మొదటి బౌలర్ అయ్యాడు. ఓల్డ్ ఢిల్లీ తరపున అతను సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌పై హ్యాట్రిక్ తీసుకున్నాడు. అతను డీపీఎల్‌లో ఆడిన 10 మ్యాచ్‌ల‌్లో 13 వికెట్లు తీసుకున్నాడు.
ప్రిన్స్ యాదవ్ ఎవరు, కెరీర్ ఎలా ఉంది
డిసెంబర్ 12, 2001న జన్మించిన ప్రిన్స్ యాదవ్ ఒక ఫాస్ట్ బౌలర్. అతను మొత్తం 9 టీ20 మ్యాచ్‌లలో 11 వికెట్లు తీసుకున్నాడు. అతని ఎకానమీ 8.08 ఉంది.