IPL 2025 KKR VS MI Updates : ఈ సీజ‌న్లో ముంబై ఇండియ‌న్స్ తొలి విజ‌యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే. చెన్నై సూప‌ర్ కింగ్స్, గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో ప‌రాజ‌యం పొందిన త‌ర్వాత ఆదివారం సొంత‌గ‌డ్డ ముంబైపై తొలి మ్యాచ్ ఆడిన ముంబై.. కోల్ కతా నైట్ రైడర్స్ పై ఎనిమిది వికెట్ల‌తో ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో పాయింట్ల ప‌ట్టిక‌లో ప‌ది నుంచి ఆరో స్థానానికి ఎగ‌బాకింది. ఓపెన‌ర్ క‌మ్ వికెట్ కీప‌ర్ ర్యాన్ రికెల్ట‌న్ (63 నాటౌట్), అరంగేట్ర బౌల‌ర్ అశ్వ‌నీ కుమార్ (4 వికెట్లు)తో స‌త్తా చాటి టాప్ ఫ‌ర్మార్లుగా నిలిచారు. దీంతో 116 ప‌రుగుల‌కు ఆలౌటైన కేకేఆర‌.. కేవ‌లం 117 ప‌రుగుల టార్గెన్ ను ముంబై ముందుంచింది.

అయితే ఈజీ టార్గెట్ ను ఛేజ్ చేయ‌డంలో ముంబై బ్యాట‌ర్ రోహిత్ శ‌ర్మ చెల‌రేగుతాడ‌న‌కుంటే దాదాపు బంతికో ప‌రుగు చొప్పున చేసి 13 ప‌రుగుల‌కే ఆలౌటయ్యాడు. ఈ సీజ‌న్ లో మూడు మ్యాచ్ లాడిన హిట్ మ్యాన్ 0, 8, 13 ప‌రుగుల‌తో ఓవ‌రాల్ గా 21 ప‌రుగులే సాధించాడు. దీంతో అత‌ని మీద విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. తాజాగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ .. రోహిత్ శ‌ర్మ వైఫ‌ల్యాల‌పై ఘాటుగా స్పందించాడు. అక్క‌డ రోహిత్ ప్లేస్ లో ఎవ‌రైనా ఉన్న‌ట్ల‌యితే ఆ ఆట‌గాడిని త‌ప్పించేవార‌ని పేర్కొన్నాడు. 

అసలేం జ‌రుగుతోంది.. గ‌త సీజ‌న్ నుంచి ముంబై టీమ్ లో కేవ‌లం బ్యాట‌ర్ గా మాత్ర‌మే రోహిత్ ఆడుతున్నాడు. కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాకు ప‌గ్గాల‌ను టీమ్ మేనేజ్మెంట్ అప్ప‌గించింది. ఇక ఈ సీజ‌న్ లో రోహిత్ దాదాపు గా ఇంపాక్ట్ స‌బ్ గా బ‌రిలోకి దిగుతున్నాడు. దీంతో బ్యాట‌ర్ గా క‌నీస ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం రోహిత్ విధి అని వాన్ చెబుతున్నాడు. సీనియ‌ర్ రోహిత్ ఇచ్చే ఆరంభాల‌తోనే జ‌ట్టు పుంజుకుంటుంద‌ని పేర్కొన్నాడు. త‌ను ఇంపాక్ట్ స‌బ్ గా బ‌రిలోకి దిగుతుండ‌టంతో క‌నీసం త‌న సార‌థ్య స‌ల‌హాల‌ను కూడా జ‌ట్టు అవ‌స‌రం ప‌డ‌టం లేద‌ని పేర్కొన్నాడు. 

కె్ప్టెన్ గా ఎందుకు ఉండ‌ట్లేదు..ప్ర‌స్తుతం ఇండియ‌న్ వ‌న్డే, టెస్టు జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అత‌ని సారథ్యంలో గ‌త కొంత‌కాలంగా అద్భుతంగా ఆడుతోంది. మరపురాని విజయాలను తన సొంతం చేసుకుంది గ‌తేడాది టీ20 ప్ర‌పంచ‌క‌ప్, ఈ ఏడాది ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీల‌ను భార‌త్ నెగ్గింది. ఇవి కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సాధించింది. ప్ర‌స్తుతం క్రికెట్లో రోహిత్ ని మించి అత్యుత్త‌మ సార‌థి లేద‌నడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి రోహిత్ ను కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించ‌డం ముంబై చేస్తున్న పొర‌పాట‌ని వాన్ అభిప్రాయ ప‌డ్డాడు. జ‌ట్టుకు ఐదుసార్లు క‌ప్పును అందించిన అత‌ని సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని సూచించాడు. ఇక 2020 నుంచి ముంబై క‌ప్పు కొట్ట‌లేదు. గ‌తేడాది పాండ్యా సార‌థ్యంలో టోర్నీలోనే అత్య‌ధ‌మంగా ప‌దో స్థానంలో ముంబై నిలిచింది. ఈ నేప‌థ్యంలో టీమ్ మేనేజ్మెంట్ మ‌రోసారి దీనిపై ఆలోచ‌న చేయాల‌ని సూచించాడు. ఇక ఈ సీజ‌న్ లో మూడు మ్యాచ్ లు ఆడిన ముంబై.. రెండింటిలో ఓడిపోయి, ఒక్క‌దాంట్లోనే గెలిచింది.