IPL 2025లో 55 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. లీగ్ స్టేజీ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఇంకా ఒక్క జట్టు కూడా అధికారికంగా ప్లేఆఫ్‌లో తమ బెర్త్ ఖరారు చేసుకోలేదు. అయితే ఇదివరకే సీఎస్కే, రాజస్తాన్ జట్లు ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకోగా.. సోమవారం రాత్రి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సర్‌రైజర్స్ సైతం ఇంటి బాట పడుతోంది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో టాప్ 4 స్థానాలకు పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. 

RCB జట్టు 11 మ్యాచ్‌లలో 8 మ్యాచ్‌లలో గెలిచి, 3 ఓడింది. 16 పాయింట్లతో ఉన్నా కూడా ఇంకా ఆర్సీబీకి ప్లేఆఫ్ టిక్కెట్ ఖరారు కాలేదు. అయితే కచ్చితంగా ప్లేఆఫ్ చేరుతుంది. ఇతర జట్ల పాయింట్లు గమనిస్తే RCBని ప్లేఆఫ్‌కు చేర్చవచ్చు. అయితే RCB కి ప్లేఆఫ్ కంటే టాప్ 2లో ఉండటంపై ఎక్కువ ఫోకస్ చేసింది. టాప్ 2 జట్లకు ఫైనల్‌కు చేరడానికి 2 అవకాశాలు ఉంటాయి.

పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్‌లలో 7 విజయాలతో పాయిట్స్ టేబుల్‌లో 2వ స్థానంలో ఉంది, ఒక మ్యాచ్ రద్దు అయింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని ఈ జట్టుకు 15 పాయింట్లు ఉన్నాయి. ప్లేఆఫ్‌కు చేరడానికి మరో మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది.

SRH vs DC మ్యాచ్ రద్దు కావడంతో ఆ జట్లపై ప్రెజర్

హైదరాబాద్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల టేబుల్ లో 5వ స్థానంలో ఉంది, ఢిల్లీ ఖాతాలో 13 పాయింట్లు ఉన్నాయి. దానికి ఇంకా 3 మ్యాచ్‌లు ఉన్నాయి, అవన్నీ గెలిస్తే 19 పాయింట్లతో తిరుగు లేకుండా ప్లే ఆఫ్ చేరుకోవచ్చు. ఢిల్లీ తరువాత 3 మ్యాచ్‌లలో కనీసం 2 మ్యాచ్‌లు గెలవాలి. నిన్న మ్యాచ్ రద్దు అయి ఢిల్లీకి ఒక పాయింట్ రావడంతో ఇతర జట్లపై ఒత్తిడి పెరిగింది.

కోల్‌కతా నైట్ రైడర్స్‌ (KKR)తో పాటు గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌‌పై  ఒత్తిడి పెరిగింది. ఒక్క మ్యాచ్ ఓడినా వారు రేసులో వెనుకంజ వేయాల్సి వస్తుంది. KKR 11లో 5 మ్యాచ్‌లు గెలిచింది, దానికి 11 పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం కేకేఆర్ ఆరవ స్థానంలో ఉంది. ఇంకా 3 మ్యాచ్‌లు ఉన్నాయి. అన్నీ గెలిస్తే 17 పాయింట్లకు చేరుకోవచ్చు.

KKRలాగే లక్నో కూడా 11లో 5 మ్యాచ్‌లు ఓడింది, గత 3 మ్యాచ్‌లలో వరుస ఓటములతో డీలా పడిన లక్నో 10 పాయింట్లతో జట్టు 7వ స్థానంలో ఉంది. కానీ SRH మ్యాచ్ ఢిల్లీ ఓడిపోయి ఉంటే అది ఈ జట్లకు కలిసొచ్చేది. కానీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయి ఢిల్లీకి కాస్త ఉపశమనం కలిగింది.  

నేడు MI vs GT మధ్య కీలక పోరు

నేడు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక పోరు జరగనుంది. ప్లే ఆఫ్ చేరడంతో పాటు తొలి రెండు స్థానాల్లో నిలిచేందుకు గుజరాత్, ముంబై పోటీ పడుతున్నాయి. నేటి మ్యాచ్ ఏ జట్టు గెలిచినా 16 పాయింట్లు అవుతాయి. ప్లేఆఫ్ స్థానం దాదాపుగా ఖరారవుతుంది. ఓడిపోయిన జట్టు తరువాతి మ్యాచ్ లో నెగ్గాలన్న టెన్షన్ ఉంటుంది.

ముంబై ఇండియన్స్ 11 మ్యాచ్‌లలో 7 విజయాలతో మూడవ స్థానంలో ఉండగా.. GT 10 మ్యాచ్‌లడి 7 విజయాలతో 4వ స్థానంలో ఉంది. రెండింటికీ 14 పాయింట్లు ఉన్నాయి. కానీ ముంబై నెట్ రన్ రేట్ (+1.274) ఆర్సీబీ (+0.482) కంటే మెరుగ్గా ఉంది.

ప్లే ఆఫ్ అవకాశాలు ఎలా ఉన్నాయంటే..

  • RCB: 3 మ్యాచ్‌లలో 1 మ్యాచ్ గెలవాలి
  • PBKS: 3 మ్యాచ్‌లలో 2 మ్యాచ్‌లు గెలవాలి
  • MI: 2 మ్యాచ్‌లలో 2 మ్యాచ్‌లు గెలవాలి
  • GT: 4 మ్యాచ్‌లలో 2 మ్యాచ్‌లు గెలవాలి
  • DC: 3 మ్యాచ్‌లలో 3 మ్యాచ్‌లు గెలవాలి (19 పాయింట్లకు చేరుకోవచ్చు)
  • KKR: 3 మ్యాచ్‌లలో 3 మ్యాచ్‌లు గెలవాలి (17 పాయింట్లకు చేరుకోవచ్చు)
  • LSG: 3 మ్యాచ్‌లలో 3 మ్యాచ్‌లు గెలవాలి (16 పాయింట్లకు చేరుకోవచ్చు)

IPL 2025 రానున్న 5 కీలక మ్యాచ్‌లివే

  1. MI vs GT: మే 6
  2. KKR vs CSK: మే 7
  3. PBKS vs DC: మే 8
  4. LSG vs RCB: మే 9
  5. SRH vs KKR: మే 10

IPL 2025 ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న జట్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్ IPL 2025లో ప్లేఆఫ్ పోటీ నుంచి వైదొలగిన మూడో జట్టుగా నిలిచింది. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మరో టైటిల్ ఆశలు గల్లంతయ్యాయి.