IPL 2025 Final Live Streaming: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య IPL సీజన్ 18 ఫైనల్ (RCB vs PBKS IPL Final Live) మ్యాచ్ జరగనుంది. ఏ జట్టు గెలిచినా అది వారి మొదటి IPL టైటిల్ అవుతుంది. RCB క్వాలిఫైయర్-1లో పంజాబ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. అయితే పంజాబ్ రెండో క్వాలిఫైయర్‌లో ముంబైని ఓడించింది. మ్యాచ్ షెడ్యూల్, లైవ్ ప్రసారం, లైవ్ స్ట్రీమింగ్ వివరాలను తెలుసుకోండి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు 36 మ్యాచ్‌లు ఆడాయి. RCB, పంజాబ్ రెండు జట్లు కూడా చెరో 18 మ్యాచ్‌లు గెలిచాయి. IPL 2025లో ఈ రెండు జట్లు 3 సార్లు తలపడ్డాయి, 2 సార్లు RCB, ఒకసారి పంజాబ్ గెలిచింది. మూడు మ్యాచ్‌లలోనూ రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. కెప్టెన్లు రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్ ఫైనల్‌లోనూ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకునేందుకు అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
IPL ఫైనల్ ఏ రోజు జరుగుతుంది?
IPL 2025 ఫైనల్ మ్యాచ్ మంగళవారం, జూన్ 3, 2025న జరుగుతుంది.
IPL ఫైనల్ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ IPL ఫైనల్ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది, టాస్ 7 గంటలకు జరుగుతుంది.
RCB vs PBKS IPL ఫైనల్ వేదిక
IPL ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.
RCB vs PBKS ఫైనల్ మ్యాచ్ లైవ్ ప్రసారం ఎక్కడ?
స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ HD, స్టార్ స్పోర్ట్స్ 1 HD, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళం, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళం HD, స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడ, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు HD.
RCB vs PBKS ఫైనల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ?
ల్యాప్‌టాప్/కంప్యూటర్‌లో జియోహాట్‌స్టార్ వెబ్‌సైట్‌లో, మొబైల్‌లో జియోహాట్‌స్టార్ యాప్‌లో IPL ఫైనల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ రిపోర్ట్
IPL ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. మంగళవారం వర్షం పడే అవకాశం ఉంది. అందువల్ల పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది, ఇక్కడ ముందుగా బ్యాటింగ్ చేసే జట్టు 220 పరుగులు చేస్తేనే గట్టి పోటీ ఇవ్వగలదు. 200 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడం ఇక్కడ చాలా కష్టం కాదు. ఇక్కడ బంతి బాగా బ్యాట్‌పైకి వస్తుంది, మ్యాచ్‌కు ముందు వర్షం పడితే ఇది బౌలర్లకు మరింత సవాలుగా మారుతుంది. టాస్ గెలిచిన కెప్టెన్ ఇక్కడ ముందుగా బౌలింగ్ ఎంచుకుంటారు. ఫాస్ట్ బౌలర్ల కంటే ఇక్కడ స్పిన్నర్లకు ప్రయోజనం ఉంటుంది, గాలి బలంగా వీస్తే ఇది బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బంది కలిగిస్తుంది.
అహ్మదాబాద్ వాతావరణం
మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది, సాయంత్రం 7:00 గంటలకు టాస్ వేస్తారు. ప్రారంభ సమయంలో ఆటకు వర్షం అంతరాయం కలిగించవచ్చు. సాయంత్రం 6:00లకు వర్షం పడే అవకాశం 51% ఉంది. సాయంత్రం 7:00లకు వర్షం పడే ఛాన్స్ 5 శాతమే ఉఁది. రాత్రి 8:00 నుంచి రాత్రి 11:00 వరకు వర్షం పడే అవకాశం కేవలం 2% ఉంది.
టాస్ వేయడానికి ఒక గంట ముందు వర్షం పడే అవకాశం ఉంది, కానీ సమయం గడిచే కొద్దీ వర్షం ప్రభావం లేదని ఇప్పటి వరకు ఉన్న వెదర్ రిపోర్టు బట్టి అర్థమవుతుంది. సాయంత్రం 7 గంటల తర్వాత అంతరాయం కలిగే అవకాశాలు చాలా తక్కువ. రిజర్వ్ డే అమలులో ఉండటం,, రెండు గంటలు అదనంగా కేటాయించడంతో ఫైనల్ మ్యాచ్‌కు ఎలాంటి సమస్య ఉండదని అంటున్నారు.