చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీష్ రానా (81 పరుగులు, 36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్ తో రాజస్థాన్ మోస్తరు స్కోరు చేయగలిగింది. 

బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సీఎస్కే బౌలర్ ఖలీల్ అహ్మద్ షాక్ ఇచ్చాడు. జైస్వాల్ 4 పరుగులు చేసి ఔటయ్యాడు. అతను ఔట్ అయిన తర్వాత, శాంసన్, వన్ డౌన్ బ్యాటర్ నితీష్ రాణా చక్కదిద్దారు. శాంసన్ క్రీజులో కుదురుకునేలోపే ఔటయ్యాడు. 16 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ తో 20 పరుగులు చేసిన శాంసన్ ఔటయ్యాడు. 

నితీష్ రాణా బౌండరీలు బాదుతూ తన సత్తా చూపించాడు. అశ్విన్, పతిరానా, ఓవర్టన్, ఖలీల్ అహ్మద్ ఎవరు బౌలింగ్ చేసినా ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అశ్విన్ బౌలింగ్ లో ధోనీ మాస్టర్ మైండ్, బౌలర్ బ్రిలియన్స్ తో నితిష్ రాణా ఔటయ్యాడు. అర్ధ సెంచరీ నుంచి సెంచరీ దిశగా దూసుకుపోతున్న నితిష్ రాణాను ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతి వేయగా ధోనీ స్టంపౌట్ చేశాడు. దాంతో నితీష్ రాణా 81 పరుగులు భారీ ఇన్నింగ్స్ ముగిసింది. 

చివర్లో కట్టడి చేసిన సీఎస్కే బౌలర్లుకీపర్ ధ్రువ్ జురేల్ సైతం 3, హసరంగా 4 పరుగులకు త్వరగా ఔటయ్యారు. రాజస్థాన్ తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ పరవాలేదనిపించాడు. పరాగ్ 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేసి ఔటయ్యాడు. వరుస విరామాల్లో చెన్నై బౌలర్లు రాజస్థాన్ బ్యాటర్లను ఔట్ చేయడంతో చివర్లో రన్ రేట్ తగ్గింది. లేకపోతే 200 పరుగులు దాటేవి. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నూర్ అహ్మద్, పతిరానా, ఖలీల్ అహ్మద్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అశ్విన్ ఒక వికెట్ తీశాడు. నూర్ అహ్మద్ మళ్లీ పర్పుల్ క్యాప్ సాధించాడు. లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచి సత్తా చాటాడు.