IPL 2024 Top 10 Highest Individual Score : ఐపీఎల్(IPL) అంటనే బ్యాటర్ల వీర విహారం. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోస్తూ బ్యాటర్లు చేసే విధ్వంసం. ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఎలాగైనా కప్పు కొట్టాలని అన్ని జట్లు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. తొలి ఓవర్ తొలి బంతి నుంచే ఎదురుదాడే వ్యూహంగా విధ్వంసకర బ్యాటర్లు చెలరేగిపోతారు. 16 సీజ్లను పూర్తి చేసుకొని 17వ సీజన్ లోకి అడుగు పెట్టబోతోంది ఐపీఎల్ అయినా కొన్ని రికార్డులు మాత్రం చెక్కు చెదరడం లేదు. అప్పుడెప్పుడో బ్యాటింగ్‌లో భారీ స్కోరు సాధించిన ఆటగాళ్లు రికార్డులు ఇంకా పదిలంగానే ఉన్నాయి. క్రిస్ గేల్ నుంచి గిల్ దాకా ఎంతోమంది తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిమానులను అలరించారు. ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ఉన్న టాప్ టెన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లను ఓసారి చూద్దాం ..
అసలు క్రికెట్ లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(Chris Gayle) ను తలచుకోకుండా మొదలు పెట్టేదే లేదు. తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే గేల్.. క్రీజులో నిలబడ్డాడంటే బంతులు బౌండరీలు దాటాల్సిందే. ఐపీఎల్ వచ్చిన తొలి నాళ్లల్లో శతకం సాధించడమే ఒక పెద్ద విషయంగా.. ఆశ్చర్యకరంగా ఉండేది. కానీ 2013లో పుణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు తరపున బరిలోకి దిగిన గేల్ 175 పరుగులతో బౌలర్లను ఊచకోత కోశాడు. అది మొదలు ఆటగాళ్లు అదరగొట్టటం మొదలు పెట్టారు. కానీ ఇప్పటివరకూ ఈ రికార్డును దాటే మొనగాడు రాలేదు.
ఇక 2008. ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ తరపున బరిలోకి దిగిన మెక్‌కల్లమ్(Brendon McCullum) బెంగళూరు బౌలర్లను ఆటాడించాడు. 158 పరుగులతో అదరగొట్టేసాడు. గత ఏడాది జరిగిన ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తరపున బరిలోకి దిగిన డికాక్(Quinton de Kock) కూడా చెలరేగిపోయాడు. కోల్‌కత్తా నైట్ రైడర్స్‌పై 140 పరుగులు చేసాడు. ఇక మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. బంతిని మైదానం నలుదిక్కులా కొట్టేయగల విధ్వంసకర ఆటగాడు. 2015 ఐపీఎల్‌లో బెంగళూరు తరపున బరిలోకి దిగిన డివిలియర్స్(AB de Villiers) ముంబయి బౌలర్లను ఊరిస్తూ 133 పరుగులు చేశాడు. మన టీమిండియాలో స్టార్ ఆటగాడు కె.ఎల్. రాహుల్(KL RAhul) 2020 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరపున బరిలోకి దిగిన ఆర్సీబీపై 132 పరుగులు చేసాడు. గత ఏడాది జరిగిన ఐపీఎల్‌లో గిల్ చెలరేగిపోయాడు. గుజరాత్ తరపున బరిలోకి దిగిన గిల్(Shubhman Gill) ముంబయిపై 129 పరుగులు చేసి సత్తా చాటాడు. ఐపీఎల్ 2012 లో గేల్ మరోసారి తన తడాఖ చూపించాడు. 2012లో దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు తరపున బరిలోకి దిగిన గేల్ 128 పరుగులతో బౌలర్లను ఊచకోత కోశాడు.
2018లో జరిగిన ఐపీఎల్‌లో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ తరపున బరిలోకి దిగిన పంత్(Rishab Panth) 128 పరుగులతో సత్తా చాటాడు.. ఇప్పుడు కూడా దారుణమైన ఆక్సిడెంట్ తరువాత మళ్ళీ కొలుకొని విధ్వంసం సృష్టించదానికి సిద్ధంగా ఉన్నాడు. 2010లో జరిగిన ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ తరపున బరిలోకి దిగిన మురళీ విజయ్(Murali Vijay) రాజస్థాన్ రాయల్స్‌పై 127 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగిన వార్నర్(Devid warner) కోల్‌కత్తా126 పరుగులు చేసి తన తడాఖా చూపించాడు.