CSK vs RCB in opener on March 22 : ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League) షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 22న ఐపీఎల్‌ మహా సమరం ప్రారంభం కానుంది. దేశంలోనే పూర్తిగా ఐపీఎల్‌ నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో  ఐపీఎల్ 17వ ఎడిషన్ మొదటి 15 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు జరిగే మ్యాచ్‌లను తెలిపారు.  చెన్నై సూపర్ కింగ్స్‌... రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్‌ జరగనుంది. 


మార్చి 22: చెన్నై సూపర్‌ కింగ్స్‌ X రాయల్ ఛాలెంజర్స్‌బెంగళూరు (చెన్నై)
మార్చి 23: పంజాబ్‌ కింగ్స్‌ (PBKS) X దిల్లీ క్యాపిటల్స్‌ (DC) (మొహాలీ)
మార్చి 23: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) X సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) (కోల్‌కతా)
మార్చి 24: రాజస్థాన్ రాయల్స్‌ (RR) X లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (LSG) (జైపుర్)
మార్చి 24: గుజరాత్‌ టైటాన్స్‌ (GT) X ముంబయి ఇండియన్స్‌ (MI) (అహ్మదాబాద్‌)
మార్చి 25: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు X పంజాబ్ కింగ్స్‌ (బెంగళూరు)
మార్చి 26: చెన్నై సూపర్ కింగ్స్‌ X గుజరాత్‌ టైటాన్స్ (చెన్నై)
మార్చి 27: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ X ముంబయి ఇండియన్స్‌ (హైదరాబాద్‌)
మార్చి 28: రాజస్థాన్‌ రాయల్స్ X దిల్లీ క్యాపిటల్స్‌ (జైపుర్)
మార్చి 29: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు X కోల్‌కతా నైట్‌రైడర్స్ (బెంగళూరు)
మార్చి 30: లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ X పంజాబ్‌ కింగ్స్‌ (లఖ్‌నవూ)
మార్చి 31: గుజరాత్‌ టైటాన్స్‌ X సన్‌రైజర్స్ హైదరాబాద్ (అహ్మదాబాద్‌)
మార్చి 31: దిల్లీ క్యాపిటల్స్‌ X చెన్నై సూపర్ కింగ్స్‌ (వైజాగ్‌)
ఏప్రిల్ 01: ముంబయి ఇండియన్స్ X రాజస్థాన్‌ రాయల్స్ (ముంబయి)
ఏప్రిల్ 02: రాయల్ ఛాలెంజర్స్‌ X లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (బెంగళూరు)
ఏప్రిల్ 03: దిల్లీ క్యాపిటల్స్‌ X కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (వైజాగ్‌)
ఏప్రిల్ 04: గుజరాత్ టైటాన్స్‌ X పంజాబ్ కింగ్స్‌ (అహ్మదాబాద్‌)
ఏప్రిల్ 05: హైదరాబాద్‌ X చెన్నై సూపర్ కింగ్స్‌ (హైదరాబాద్‌)
ఏప్రిల్‌ 6: రాజస్థాన్‌ రాయల్స్ X రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు (జైపుర్)
ఏప్రిల్ 7: ముంబయి ఇండియన్స్ X దిల్లీ క్యాపిటల్స్‌ (ముంబయి)
ఏప్రిల్ 7: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ X గుజరాత్ టైటాన్స్ (లఖ్‌నవూ)