IPL 2024 RR vs GT Head to Head Records: జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌(GT)తో రాజస్థాన్‌ రాయల్స్‌(RR) కీలక పోరుకు సిద్ధమైంది. ప్లే ఆఫ్‌కు చేరాలంటే ప్రతీ మ్యాచ్‌ కీలకమైన నేపథ్యంలో ఈ మ్యాచ్‌... గుజరాత్‌కు చాలా కీలకంగా మారింది. రాజస్థాన్‌ రాయల్స్‌ ఈ ఐపీఎల్‌లో.. ఇంతవరకూ ఓటమి లేని ఒకే ఒక జట్టుగా నిలిచింది. రాజస్థాన్‌ ఈసారి టైటిల్ పోటీదారులలో ఒకటిగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్‌ విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్, రషీద్ ఖాన్ వంటి స్టార్లు ఫామ్‌లోకి వస్తే రాజస్థాన్‌కు చెక్‌పెట్టడం గుజరాత్‌కు పెద్ద కష్టం కాకపోవచ్చు. 


 

హెడ్‌ టు హెడ్‌ రికార్డ్స్‌ ఇలా..

ఐపీఎల్‌లో ఇప్పటివరకూ గుజరాత్ టైటాన్స్‌-రాజస్థాన్‌ రాయల్స్‌ అయిదుసార్లు తలపడ్డాయి. అందులో గుజరాత్ నాలుగుసార్లు గెలవగా... రాజస్థాన్‌ ఒక్కసారి మాత్రమే గెలిచింది. రాజస్థాన్‌ రాయల్స్- గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య 2022లో తొలిసారి జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో గుజరాత్‌ విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్‌ బ్యాటర్‌ జోస్ బట్లర్ 24 బంతుల్లో 54 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యుజ్వేంద్ర చాహల్ నాలుగు ఓవర్లలో 32 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. 2023లో రాయల్స్ మూడు వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. ఇదే ఐపీఎల్‌లో గుజరాత్‌పై రాజస్థాన్‌కు ఉన్న ఒకే ఒక గెలుపు. ఆ మ్యాచ్‌లో షిమ్రాన్ హెట్మెయర్ కేవలం 26 బంతుల్లో అజేయంగా 56 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

ఐపీఎల్ 2022 క్వాలిఫైయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 188/6తో తమ అత్యధిక స్కోరును నమోదు చేసింది. రాయల్స్ తరఫున జోస్ బట్లర్ 56 బంతుల్లో 89 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు, అయితే గుజరాత్‌ టైటాన్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుత మ్యాచ్‌ జరిగే జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్‌-గుజరాత్ ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో రాజస్తాన్‌ తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోయింది.

 

రాజస్థాన్‌-గుజరాత్‌ రికార్డులు

 

రాజస్థాన్‌ అత్యధిక జట్టు స్కోరు: 188/6 

గుజరాత్‌ అత్యధిక జట్టు స్కోరు: 192/4

రాజస్థాన్‌ అత్యధిక వ్యక్తిగత స్కోరు: 89 (జోస్ బట్లర్) 

గుజరాత్‌ అత్యధిక వ్యక్తిగత స్కోరు: 87* (హార్దిక్ పాండ్యా)

రాజస్థాన్‌ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు: 2/25 సందీప్ శర్మ

గుజరాత్‌ ఉత్తమ బౌలింగ్ గణాంకాలు: 3/14 రషీద్ ఖాన్

 


జట్లు

రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్‌), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, కేశవ్ మహరాజ్, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్, రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్‌మోర్, అబిద్ ముస్తాక్, నాంద్రే బర్గర్. 

 

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, రాబిన్ మింజ్, కేన్ విలియమ్సన్, అభినవ్ మంధర్, బి సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షారుఖ్ ఖాన్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాతియా, కార్తీ త్యాగి, శాంత్ మిశ్రా, స్పెన్సర్ జాన్సన్, నూర్ అహ్మద్, సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ మరియు మానవ్ సుతార్.