MI vs RR Match  Rajasthan Royals opt to bowl: ఐపీఎల్ 17 సీజన్‌లో భాగంగా  ముంబయి(MI)తో రాజస్థాన్‌(RR) తలపడనుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు పాయింట్ల ఖాతా తెరవని ముంబయి.. ఈ మ్యాచ్‌ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. టాస్ గెలిచిన రాజస్థాన్‌ కెప్టెన్ సంజు శాంసన్ టాస్‌  తొలుత ప్రత్యర్థి జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు.  ముంబై ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిపోగా... రాజస్థాన్‌ మాత్రం ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి జైత్రయాత్ర కొనసాగించాలని రాజస్థాన్‌ చూస్తుండగా.... గెలుపు బాట పట్టాలని ముంబై వ్యూహాలు రచిస్తోంది.


పాయింట్ల పట్టికలో చివరి స్థానం
ఐపీఎల్‌ టైటిల్‌ను ఐదుసార్లు గెలుచుకున్న ముంబై ఇప్పుడు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఇవి తొలి దశ మ్యాచ్‌లే అయినా ముంబై లాంటి భీకర జట్టుకు రెండు మ్యాచ్‌ల్లో పరాజయం ఎదురవ్వడమే ఫ్యాన్స్‌ను ఆందోళన పరుస్తోంది. ముంబై నెట్‌ రన్‌రేట్‌ కూడా ఘోరంగా -0.925గా ఉంది. అన్ని జట్టలో ఇదే తక్కువ రన్‌రేట్‌ కావడం విశేషం. సూర్యకుమార్ యాదవ్ లేకపోవడం ముంబై బ్యాటింగ్‌ లయను దెబ్బతీస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌తో తమ చివరి ఐదు మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ నాలుగుసార్లు విజయం సాధించింది. కానీ ఇప్పుడు రాజస్థాన్‌ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. సంజూ శాంసన్ జట్టు రెండు మ్యాచుల్లో గెలవడంతో ముంబైకి కూడా కఠిన సవాల్‌ తప్పకపోవచ్చు. ముంబైకి మంచి ఓపెనింగ్‌ భాగస్వామ్యం రావాల్సి ఉంది. రోహిత్ శర్మ, ఇషాన్‌ కిషన్ నుంచి ముంబై జట్టు భారీ స్కోర్లు ఆశిస్తోంది. జస్ప్రీత్ బుమ్రాను పాండ్యా సరైన సమయంలో వాడుకోవడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఈ లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. బుమ్రా, పీయూష్ చావ్లాలు బౌలింగ్‌లో రాణిస్తున్నారు. వాంఖడే స్టేడియంలో అపారమైన అనుభవం కలిగిన స్థానిక కుర్రాడు షమ్స్ ములానీ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నమన్ ధీర్‌లు కూడా భారీ స్కోర్లపై కన్నేశారు. 


ఆల్ టైమ్ టాప్ పెర్ఫార్మర్స్
ఐపీఎల్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరులో జోస్ బట్లర్  అత్యధికంగా 467 పరుగులు చేశాడు. తర్వాతి స్థానాల్లో సంజూ శాంసన్ 462 పరుగులతో ఉన్నాడు. 
మూడో స్థానంలో 414 పరుగులతో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. బౌలర్ల జాబితాలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ధావల్ కులకర్ణి, జస్ప్రీత్ బుమ్రా 17 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. జోఫ్రా ఆర్చర్ 13 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 


ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, శ్రేయస్ గోపాల్, ఇషాన్ కిషన్, అన్షుల్ కాంబోజ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, క్వేనా మఫకా, మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, తిలక్ వర్మ, విష్ణు వినోద్, నేహాల్ వధేరా, ల్యూక్ వుడ్, సూర్యకుమార్ యాదవ్.


రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్ (కెప్టెన్‌), అబిద్ ముస్తాక్, అవేష్ ఖాన్, ధ్రువ్ జురెల్, డోనోవన్ ఫెరీరా, జోస్ బట్లర్, కుల్దీప్ సేన్, కునాల్ సింగ్ రాథోడ్, నాంద్రే బర్గర్, నవదీప్ సైనీ, రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, షిమ్రాన్ హెట్మెయర్, శుభమ్ దూబే, రోవ్‌మన్ పావెల్, టామ్ కొహ్లర్-కాడ్మోర్, ట్రెంట్ బౌల్ట్, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్, తనుష్ కొటియన్.