IPL 2024  LSG vs KKR Kolkata Knight Riders won by 98 runs: లక్నో(LSG) పై కోల్‌కతా(KKR) 98 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో  అగ్రస్థానానికి దూసుకెళ్లింది. కోల్‌కతా నిర్దేశించిన 236 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలో దిగిన లక్నో రెండవ ఓవర్లోనే తొలి వికెట్ ను కోల్పోయింది. అక్కడి నుంచి వరుసగా  ఒక్కో ఓవర్ లో ఒక్కో బ్యాట్స్ మెన్ పెవిలియన్ చేరారు. 137 పరుగుల వద్ద లఖ్‌నవూ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. దీంతో లక్నోతో జరిగిన  మ్యాచ్‌లో కోల్‌కతా 98 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో కోల్‌కతా అగ్రస్థానానికి చేరుకుంది. వరుణ్ చక్రవర్తి  3, హర్షిత్ రాణా 3, రస్సెల్2 వికెట్లు తీసి లక్నో   పతనాన్ని శాసించారు. స్టార్క్‌, నరైన్ తలో వికెట్ పడగొట్టారు.


కోల్‌కత్తా ఇన్నింగ్స్ 


ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన  లక్నో... కోల్‌కత్తాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కోల్‌కత్తా ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌... సునీల్‌ నరైన్‌ మంచి ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ నాలుగు ఓవర్లలోనే 61 పరుగులు జోడించారు. ఫిల్‌ సాల్ట్‌ కేవలం 14 బంతుల్లో అయిదు ఫోర్లు, ఒక సిక్సుతో 32 పరుగులు చేసి సాల్ట్‌ అవుటయ్యాడు.   27 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న తర్వాత   రెచ్చిపోయిన సునీల్ నరైన్  స్టాయినిస్ వేసిన 11వ ఓవర్‌లో చివరి నాలుగు బంతుల్లో మూడు సిక్స్‌లు బాదాడు. అయితే సరిగ్గా 140 పరుగుల వద్ద కోల్‌కతా రెండో వికెట్ కోల్పోయింది. 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టి 81 పరుగులు చేసిన నరైన్.. రవి బిష్ణోయ్ వేసిన 12 ఓవర్లో చివరి బంతికి భారీ షాట్ ఆడి పడిక్కల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.


తరువాత రఘువంశీ ధాటీ గా ఆడుతుండగా కోల్‌కతా 167 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. నవీనుల్‌ హక్ వేసిన 15వ ఓవర్‌లో తొలి బంతికి ఫోర్ బాదిన ఆండ్రీ రస్సెల్ తర్వాతి బంతికే కృష్ణప్ప గౌతమ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. తరువాత కోల్‌కతా 171 పరుగుల రఘువంశీ అవుట్ అయ్యాడు. యుధ్విర్‌ సింగ్ వేసిన 15.1 ఓవర్‌లో వికెట్ కీపర్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. నవీనుల్ హక్ వేసిన 18 ఓవర్‌లో ఐదో బంతికి బౌండరీ కొట్టిన రింకు సింగ్కూ డా బౌండరీ బాది చివరి బంతికి, 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టాయినిస్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.


శ్రేయస్ అయ్యర్‌ 15 బంతుల్లో మూడు ఫోర్లతో 23 పరుగులు చేయగా....రమణ్‌దీప్‌ సింగ్‌ ఆరు బంతుల్లోనే ఒక ఫోరు, మూడు సిక్సర్లతో 25 పరుగులు చేశాడు. దీంతో కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో నవీనుల్‌ హక్‌ మూడు వికెట్లు తీశాడు.