Third Fastest 50 In Ipl History: సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రికార్డుల మోత మోగింది. ముఖ్యంగా క్రిస్ మోరిస్ ఎనిమిదేళ్ల రికార్డును ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ జాక్ ఫ్రెజర్ మెక్‌గర్క్(Jake Fraser Mcgurk) బద్దలు కొట్టాడు. జాక్ ఫ్రెజర్ మెక్‌గర్క్ మొత్తం 18 బంతులు ఆడి 65 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఏడు సిక్సులు ఉన్నాయి. కేవలం 15 బంతులకే ఆఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
ఐపీఎల్ ఎంతో మంది కుర్రాళ్ల ప్రతిభ నిరూపించుకునేందుకు చాలా పెద్ద వేదిక. ఇక్కడ ఆడి తర్వాత జాతీయ జట్లకు సెలెక్ట్ అవటం వాళ్లే తర్వాతి లెజెండ్స్ గా మారటం చాలా మందిని చూశాం. డేవిడ్ వార్నర్ నుంచి నిన్న మొన్నటి మతీషా పతిరానా వరకూ చాలా మంది ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చినవాళ్లే. అలాంటి కోటాలో చేరేందుకు ఓ 22ఆస్ట్రేలియా యువకుడు సిద్ధంగా ఉన్నాడు.
SRH తో ఢిల్లీకి జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ విసిరిన 267పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో జాక్ ఫ్రేజర్ చూపించిన బ్యాటింగ్ పవర్ ఫుల్ హిట్టింగ్ మైండ్ బ్లోయింగ్ . వాషింగ్టన్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో ప్రతీ బంతినీ బౌండరీ కి తరలించాడు. ఒక్క ఓవర్ లో మూడు ఫోర్లు, మూడు సిక్సులు బాది 30పరుగులు చేశాడు. 15బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేసి అంతకు ముందే ఇదే మ్యాచ్ లో 16 బంతుల్లో హెడ్ కొట్టిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టి..2024 ఐపీఎల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును 15బంతులతో నెలకొల్పాడు. మొత్తంగా 18బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 65పరుగులు చేశాడు. మెక్ గర్క్ ఉన్నంత సేపు ఢిల్లీ ఏమన్నా అద్భుతం చేస్తోందేమో అన్న ఆశ కలిగింది. . ఇప్పటివరకూ ఢిల్లీ తరపున మూడు మ్యాచులే ఆడిన మెక్ గర్క్ అందులో రెండు హాఫ్ సెంచరీలు బాదటం అతనెంత డేంజరస్ ప్లేయరో చెబుతోంది. ఇప్పటివరకూ మూడు మ్యాచుల్లో 14సిక్సులు కొట్టి ఫ్యూచర్ ఆఫ్ ఆస్ట్రేలియా అనే హోప్స్ తీసుకువచ్చాడు.