RCB and PBKS Close Defeats : ఈ ఐపీఎల్‌(IPL)లో అత్యంత దురదృష్టవంతమైన జట్టేది అంటే అందరూ ఠక్కున చెప్పే పేరు రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB). ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఒక విజయం ఏడు పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా..జట్టులో ఎన్ని మార్పులు చేసినా... చివరి వరకూ పోరాడినా  బెంగళూరుకు మాత్రం విజయం దక్కడం లేదు. కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్‌లో ఒక పరుగు తేడాతో బెంగళూరు పరాజయం పాలైంది.


దరిద్రం అంటే RCB దే అని ఫ్యాన్స్ కూడా తెగ బాధపడిపోతున్నారు. అయితే బెంగళూరుకు తోడుగా మరో జట్టు కూడా దురదృష్టానికి బ్రాండ్‌ అంబాసిడర్‌లా మారింది. అదే పంజాబ్‌. ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌ 2 విజయాలు.. ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. గెలుపు కోసం చివరి ఓవర్‌ వరకూ పోరాడుతున్నా పంజాబ్‌కు కూడా ఓటమి తప్పడం లేదు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ 142పరుగుల తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యింది. కానీ గుజరాత్ అంత చిన్న లక్ష్యాన్ని చేధించనివ్వకుండా అద్భుతంగా అడ్డుపడింది. రాహుల్ తెవాటియా పుణ్యమా అని ఆపసోపాలు పడి ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్ లో 7వికెట్లు కోల్పోయి 143పరుగుల లక్ష్యాన్ని అందుకుంది గుజరాత్. నిజంగా పంజాబ్ బ్యాడ్ లక్ ఈ సీజన్ మొత్తం అద్భుతమైన పోరాటాలు చేసింది. అన్ని మ్యాచ్ లు చివరి ఓవర్ కూ తీసుకువచ్చింది. కానీ మ్యాచ్ లు మాత్రం గెలవలేదు.



కోల్‌కత్తా మ్యాచ్‌లో...
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు(RCB)పై కోల్‌కతా(KKR) విజయం సాధించింది. ఆఖరు వరకు జరిగిన మ్యాచ్‌లోకోల్‌క తా చివరి బంతికి గెలుపొందింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా... నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 50 హాఫ్ సెంచరీ సాధించాడు. ఓపెనర్‌ ఫిలిప్ సాల్ట్ 48, ఆండ్రి రస్సెల్ 27, రమణ్‌ ధీప్‌ 24 పరుగులతో రాణించారు. బెంగళూరు బౌలర్లలో యశ్ దయాల్ , కామెరూన్ గ్రీన్ చెరో రెండు వికెట్లు తీశారు. సిరాజ్‌, ఫెర్గూసన్ చెరో వికెట్‌ తీశారు. అనంతరం భారీ లక్ష్యచేధనలో బెంగళూరు చివరి వరకూ పోరాడినా ఓటమి చవిచూసింది. విల్‌ జాక్స్‌, రజత్‌ పటిదార్‌ అర్థసెంచరీలతో మెరిశారు. చివర్లో దినే‌శ్‌ కార్తీక్‌, కరణ్‌ శర్మ పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రి రస్సెల్ 3, హర్షిత్‌ రాణా, సునీల్ నరైన్‌ చెరో రెండు వికెట్లు తీశారు. 


పంజాబ్‌ మ్యాచ్‌ ఇలా...
పంజాబ్‌ కింగ్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్‌ ధీటైన బౌలింగ్‌తో కట్టడి చేసినప్పటికీ నిలకడగా ఆడుతూ గుజరాత్‌ బ్యాటర్లు 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకున్నారు. 143 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్‌ బ్యాటర్లు లక్ష్యాన్ని చేరుకునేందుకు కాస్త ప్రయాస పడ్డారు. శుభ్‌మన్‌గిల్‌ , సాయి సుదర్శన్‌ ఇద్దరూ చెరో 30 పరుగులతో ఫర్వాలేదనిపించారు. కానీ పంజాబ్‌ బౌలింగ్‌లో మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. అయితే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఆడటం సమిష్టిగా జట్టుకు ప్లస్‌ అయ్యింది. ఇక చివరలో రాహుల్‌ తెవాటియా విజృంభించడంతో 19.1 ఓవర్‌లోనే లక్ష్యాన్ని చేధించి.. పంజాబ్‌ను ఓడించారు.