IPL New Rules: ఐపీఎల్ 2023(IPL 2023) సీజన్ నేటి నుంచి (మార్చి 31) ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings ), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో క్రికెట్ అభిమానులు కొన్ని కొత్త విషయాలను చూడనున్నారు. వాస్తవానికి ఈసారి ఐపీఎల్‌లో కొన్ని నిబంధనల కారణంగా చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.
ఈ సీజన్లో కెప్టెన్ ప్లేయింగ్-11ను పంచుకునేందుకు టైమింగ్, డీఆర్ఎస్ వంటి రెండు నిబంధనల్లో భారీ మార్పులు చేశారు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ వంటి కొత్త నిబంధన కూడా అమల్లోకి వచ్చింది. ఈ మూడు నిబంధనల కారణంగా ఈసారి ఐపీఎల్ మరింత ఆసక్తికరంగా సాగనుంది.
మొదటి రూల్
టాస్‌కు ముందు జట్లు తమ తమ ప్లేయింగ్ -11ను చెప్పాల్సి రావడం క్రికెట్ లో ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. అయితే ఈసారి ఐపీఎల్ లో ఇరు జట్ల కెప్టెన్స్, టీమ్‌మేనేజ్‌మెంట్‌కు కొత్త ఆప్షన్ ఉంటుంది. టాస్ తర్వాత ప్లేయింగ్-11ను జట్లు ఎంచుకోవచ్చు. ఇరు జట్ల కెప్టెన్ల వద్ద రెండు జాబితాలు ఉంటాయి. ఒక జాబితాలో మొదటి బౌలింగ్ స్థానంలో ప్లేయింగ్-11, రెండో జాబితాలో మొదట బ్యాటింగ్ చేస్తే ప్లేయింగ్-11 పేర్లు ఉంటాయి. ఈ రెండు జాబితాల్లో ఐదు ప్రత్యామ్నాయాల పేర్లు కూడా ఉంటాయి, వీటిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా మ్యాచ్ మధ్యలో యూజ్ చేసుకోవచ్చు.
రెండో రూల్
ఇప్పటి వరకు క్రికెట్లో డీఆర్ఎస్‌ను ఔట్ లేదా నాటౌట్ నిర్ణయాలు మాత్రమే తీసుకునేవారు. ఐపీఎల్ 2లో అంపైర్లు వైడ్, నో బాల్‌కు సంబంధించిన నిర్ణయాలపై డీఆర్ఎస్ తీసుకోవచ్చు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా అంపైర్ నో బాల్ ఇవ్వకపోతే తమ బ్యాటర్ మైదానం నుంచి వెనక్కి పిలిపించుకుంటానని సూచించాడు. అంటే అంపైర్ నిర్ణయాలను కెప్టెన్ డీఆర్ఎస్ ద్వారా సవాలు చేయగలడు కాబట్టి ఈసారి అలాంటి వివాదాలు ఉండవు. ఒక్కో ఇన్నింగ్స్‌కు జట్లకు అందే డీఆర్ఎస్‌ల సంఖ్య పెరగనప్పటికీ మ్యాచ్‌లను ఆసక్తికరంగా మార్చనున్నారు. అంటే అందుబాటులో ఉన్న డీఆర్ఎస్‌తో వైడ్, నో బాల్‌కు సంబంధించిన నిర్ణయాలపై జట్లు డీఆర్ఎస్ తీసుకోవాల్సి ఉంటుంది.
ముచ్చటగా మూడో రూల్
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ క్రికెట్ ప్రపంచానికి ఇదో కొత్త రూల్. అయితే గతేడాది దేశవాళీ క్రికెట్‌లో బీసీసీఐ ఈ నిబంధనను అమలు చేసింది. ఐపీఎల్‌లో ఇది తొలిసారిగా అమల్లోకి రానుంది. ఈ నిబంధన ప్రకారం జట్లు తమ ఆటగాళ్లలో ఒకరి స్థానంలో మరో ఆటగాడిని మ్యాచ్ మిడిల్‌లో తీసుకోవచ్చు. ఒక మ్యాచ్‌లో ఒక జట్టుకు ఒక ఇంపాక్ట్ ప్లేయర్‌ని మాత్రమే తీసుకురావడానికి అనుమతిస్తారు. టాస్ సమయంలో కెప్టెన్ ప్లేయింగ్-11తో పాటు ఐదుగురు ప్రత్యామ్నాయ ఆటగాళ్ల పేర్లు చెబుతాడు. ఈ ఆటగాళ్ళలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్‌ను మైదానంలోకి తీసుకురావాలంటే కెప్టెన్ ఫీల్డ్ అంపైర్ లేదా ఫోర్త్ అంపైర్ కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.