RR vs LSG, IPL 2022:


ఐపీఎల్‌ 2023లో మోస్ట్‌ ఇంట్రెస్టింగ్ టీమ్స్‌ నేడు తలపడుతున్నాయి. సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్ (RR vs LSG) ఢీకొంటున్నాయి. ఇప్పటికే తిరుగులేని స్థితిలో ఉన్న సంజూ సేనను ఓడించాలని రాహుల్‌ జట్టు పట్టుదలగా ఉంది. మరి తుది జట్లు ఎలా ఉండనున్నాయి? ఎవరిపై ఎవరిది ఆధిపత్యం?


రాయల్స్‌దే అప్పర్‌ హ్యాండ్‌!


లక్నో సూపర్‌ జెయింట్స్ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో గతేడాదే అరంగేట్రం చేసింది. ప్లేఆఫ్ చేరుకొని అదరగొట్టింది. అయితే రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో వరుసగా రెండు సార్లు ఓడింది. 2022 ఏప్రిల్‌ 10న 3 పరుగులు, మే 15న 24 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అందుకే ఈ సారి ప్రతీకారం తీర్చుకోవాలని ట్రై చేస్తోంది. కాగా ఛేదనలో లక్నో జట్టుకు మెరుగైన రికార్డు లేదు. ఛేదనలో విన్నింగ్స్‌ పర్సెంటేజీ కనీసం 20 అయినా లేదు. గతేడాది రాయల్స్‌ చేతిలో రెండుసార్లూ ఛేదనలోనే విఫలమైంది.


రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లేయింగ్ XI


తొలుత బ్యాటింగ్‌ చేస్తే : యశస్వీ జైశ్వాల్‌, జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌, దేవదత్‌ పడిక్కల్‌, రియాన్‌ పరాగ్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, ధ్రువ్‌ జోరెల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఆడమ్‌ జంపా, ట్రెంట్‌ బౌల్ట్‌, యుజ్వేంద్ర చాహల్‌


తొలుత బౌలింగ్‌ చేస్తే: యశస్వీ జైశ్వాల్‌, జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌,  రియాన్‌ పరాగ్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, ధ్రువ్‌ జోరెల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఆడమ్‌ జంపా, ట్రెంట్‌ బౌల్ట్‌, యుజ్వేంద్ర చాహల్‌, సందీప్ శర్మ


ఈ సీజన్లో దేవదత్‌ పడిక్కల్‌, రియాన్‌ పరాగ్‌ మధ్య పోటీ నెలకొంది. ఇద్దరూ బ్యాటింగ్‌లో స్ట్రగుల్‌ అవుతున్నారు. పడిక్కల్‌ కాస్త ఫర్వాలేదు. రాజస్థాన్ తొలుత బ్యాటింగ్‌ చేస్తే పడిక్కల్‌ జట్టులో ఉంటాడు. అతడిని సందీప్ శర్మ లేదా కుల్‌దీప్‌ సేన్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా సబ్‌స్టిట్యూట్‌ చేస్తారు. గాయమవ్వడంతో ఈ మ్యాచులో జోస్‌ బట్లర్‌ బదులు జో రూట్‌ను ఆడించినా ఆశ్చర్యం లేదు.


లక్నో సూపర్‌ జెయింట్స్‌ ప్లేయింగ్ XI


తొలుత బ్యాటింగ్ చేస్తే: కేఎల్‌ రాహుల్‌, కైల్‌ మేయర్స్‌, దీపక్ హుడా, కృనాల్‌ పాండ్య, నికోలస్‌ పూరన్‌, మార్కస్‌ స్టాయినిస్‌, ఆయుష్ బదోనీ, కృష్ణప్ప గౌతమ్‌, రవి బిష్ణోయ్‌, అవేశ్‌ ఖాన్‌, మార్క్‌వుడ్‌


తొలుత బౌలింగ్‌ చేస్తే: కేఎల్‌ రాహుల్‌, కైల్‌ మేయర్స్‌, దీపక్ హుడా, కృనాల్‌ పాండ్య, నికోలస్‌ పూరన్‌, మార్కస్‌ స్టాయినిస్‌, కృష్ణప్ప గౌతమ్‌, రవి బిష్ణోయ్‌, అవేశ్‌ ఖాన్‌, మార్క్‌వుడ్‌, యుధ్వీర్‌ సింగ్‌ సింగ్‌ / అమిత్‌ మిశ్రా


లక్నో సూపర్‌ జెయింట్స్‌ తొలుత బ్యాటింగ్ చేస్తే ఆయుష్ బదోనీ నేరుగా జట్టులో ఉంటున్నాడు. ఆ తర్వాత అతడిని ఇండియన్‌ పేసర్‌ లేదా స్పిన్నర్ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా సబ్‌స్టిట్యూట్‌ చేస్తున్నాడు. కొన్ని కైల్‌ మేయర్‌ ప్లేస్‌లో కృష్ణప్ప గౌతమ్‌ను తీసుకుంటున్నారు.