IPL 2023, Ravindra Jadeja: 


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో ఆటగాళ్ల సత్సంబంధాలేమో గానీ అభిమానుల ఓవర్ యాక్షన్‌ మాత్రం తగ్గట్లేదు! తమ ఫేవరెట్‌ క్రికెటర్ల కోసం ఇతర ఆటగాళ్లను అవమానిస్తూనే ఉన్నారు. అపోజిషన్‌ వాళ్లను కవ్వించినా ఓ అర్థముంది! కానీ సొంత జట్టు సహచరులనే గేలి చేస్తున్నారు!


ఐపీఎల్‌ 2023లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కీలకంగా మారాడు. గతేడాది డిజాస్టర్‌ నుంచి త్వరగా బయటపడ్డాడు. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌లో అదరగొడుతున్నాడు. చురుకైన ఫీల్డింగ్‌తో క్యాచులు పడుతున్నాడు. రనౌట్లు చేస్తున్నాడు. ఇక బౌలింగ్‌లో ఎక్కువ డాట్‌ బాల్స్‌ వేసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతున్నాడు. అలాగే వికెట్లూ తీస్తున్నాడు. బ్యాటింగ్‌లోనూ ఫినిషర్ అవతారం ఎత్తాడు. ధోనీ కన్నా ముందే వచ్చి డెత్‌ ఓవర్లలో సిక్సర్లు, బౌండరీలు దంచికొడుతున్నాడు.




రవీంద్ర జడేజా ఎంత చేసినా ఎంఎస్‌ ధోనీ (MS Dhoni) అభిమానుల్లో కొందరు అతడిని అవమానిస్తున్నారు. బ్యాటింగ్‌ చేసేందుకు మైదానంలోకి రాగానే త్వరగా ఔటై వెళ్లిపోవాలంటూ నినాదాలు చేస్తున్నారు! ఎందుకంటే అతడు పెవిలియన్‌ చేరితేనే ధోనీ వస్తాడన్నది వాళ్ల ఫీలింగ్‌! అంటే అతడి కోసం ఓ విలువైన వికెట్‌ పోయినా ఫర్వాలేదని ఫీలవుతున్నారు. దీనిని బట్టి వాళ్లు కెప్టెన్‌ కూల్‌ మైండ్‌సెట్‌తో సింక్‌ అవ్వడం లేదని అనిపిస్తోంది! స్వయంగా తనే ఆఖర్లో వస్తున్నాడంటే.. రవీంద్రుడు బాగా ఆడతాడనే కదా అర్థం!


క్వాలిఫయర్‌ వన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ (GT vs CSK) విజయం సాధించింది. ఈ మ్యాచులో 16 బంతుల్లోనే 2 బౌండరీలు  కొట్టి 22 పరుగులు చేశాడు. దానివల్లే సీఎస్కే స్కోరు ఆఖర్లో 172కు చేరింది. ఇక బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. 12 డాట్‌ బాల్స్‌ వేశాడు. మోస్ట్‌ వాల్యబుల్‌ అసెట్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు గెలిచాడు. దాంతో 'అప్‌స్టాక్స్‌కు తెలుసు.. కానీ కొందరు ఫ్యాన్స్‌కే తెలియడం లేదు' అని ట్వీట్‌ చేశాడు. అంటే తన విలువ వారికి ఇంకా అర్థమవ్వడం లేదని నేరుగా సెటైర్‌ వేశాడు.




ఇదే అదనుగా ఆర్సీబీ ఫ్యాన్స్‌ (RCB Fans) రంగంలోకి ఎంటర్‌ అయ్యారు. 'కమ్‌ టు ఆర్సీబీ' అంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. 'మిమ్మల్ని ఎలా గౌరవించాలో సీఎస్కే ఫ్యాన్స్‌కు తెలియడం లేదు. ఆర్సీబీకి వచ్చేయండి', 'సీఎస్కే ఫ్రాంచైజీ, అగౌరవపరిచే అక్కడి ఫ్యాన్స్‌కు మిమ్మల్ని పొందే అర్హత లేదు. ఆర్సీబీలోకి వచ్చేయండి. కోహ్లీలా అంటే దేవుడిలా మిమ్మల్ని చూసుకుంటాం', వచ్చే ఏడాది ఆర్సీబీకి వచ్చి కెప్టెన్సీ తీసుకో', 'సింగిల్‌ సీజన్లోనే మూడు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచులు గెలిచిన జడ్డూను సీఎస్కే ఫ్యాన్స్‌ సపోర్ట్‌ చేయడం లేదు. అతడు ఒంటి చేత్తో సీఎస్కేను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. నీకిష్టమైన కోహ్లీ టీమ్‌లో చేరేందుకు ఇదే సరైన సమయం. ఆర్సీబీకి వచ్చేయ్‌ జడ్డూ' అని ట్వీట్లు చేస్తున్నారు.


విచిత్రంగా ఇదే ఫ్యాన్స్‌ కోహ్లీ కోసం.. ఐసీసీ టీ20, వన్డే ప్రపంచ్‌ కప్‌ ఫైనల్స్‌లో వీరోచిత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న గౌతమ్ గంభీర్‌, టీమ్‌ఇండియా ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మను వడాపావ్‌ అంటూ ట్రోల్‌ చేస్తుంటారు! మొన్నటికి మొన్న శుభ్‌మన్‌ గిల్‌ సోదరిని సోషల్‌ మీడియాలో టార్గెట్‌ చేయడం గమనార్హం!