CSK vs RR Preview: 


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో బుధవారం 17వ మ్యాచ్‌ జరుగుతోంది. చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఢీకొంటున్నాయి. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది. రెండు జట్లూ చెరో మూడు మ్యాచులాడి 4 పాయింట్లతో ఉన్నాయి. మరి నేటి పోరులో గెలుపు ఎవరిది?


సంజూ సేనదే జోష్‌!


ఈ సీజన్లో రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) దూకుడు మీదుంది! చాలా బ్యాలెన్సింగ్‌గా కనిపిస్తోంది. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson) ముందుండి నడిపిస్తున్నాడు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్‌, జోస్‌ బట్లర్‌ వీరోచిత ఫామ్‌లో ఉన్నారు. సంజూ బ్యాటింగ్‌ గురించి తెలిసిందే. మిడిలార్డర్లో దేవదత్‌ పడిక్కల్‌, హెట్‌మైయిర్‌, రియాన్‌ పరాగ్‌, ధ్రువ్‌ జోరెల్‌, రవిచంద్రన్ అశ్విన్‌ నిలబడుతున్నారు. ఇందులో ఏ ఇద్దరు నిలబడ్డా దబిడి దిబిడే! రాజస్థాన్‌ బౌలింగ్‌ అద్భుతం. బంతిని స్వింగ్‌ చేస్తూ ట్రెంట్‌ బౌల్ట్‌, మిస్టరీ స్పిన్‌తో యూజీ చాహల్‌ అపోజిషన్‌ను కకా వికలం చేస్తున్నారు. కేఎం ఆసిఫ్‌, జేసన్‌ హోల్డర్‌, అశ్విన్‌ కన్‌సిస్టెంట్‌గా బౌలింగ్‌ చేస్తున్నారు. ప్రతి డిపార్ట్‌మెంట్లోనై బలమైన బ్యాకప్‌ ప్లేయర్లు ఉన్నారు. మూమెంటమ్‌ దొరికితే రాయల్స్‌ను ఆపడం కష్టం!


గాయపడ్డ సీఎస్‌కే!


ట్రోఫీ గెలిచి ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాలని ధోనీ (MS Dhoni) పట్టుదలగా ఉన్నాడు. ఆడిన మూడింట్లో రెండు గెలిచినా సీఎస్‌కే (Chennai Super kings) బలమైన జట్టని చెప్పలేం! ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, డేవాన్‌ కాన్వే మాత్రం బ్లాస్టింగ్‌ ఓపెనింగ్స్‌ ఇస్తున్నారు. అయితే ముంబయిపై వీరు విఫలమయ్యారు. వాంఖడేలో అనుభవం ఉన్న అంజిక్య రహానె వన్‌డౌన్‌లో వచ్చి విధ్వంసం సృష్టించాడు. అతడిలాగే ఆడితే చెన్నైకి ప్లస్‌ పాయింట్‌. మిడిలార్డర్లో రాయుడు, మొయిన్‌, ధోనీని నమ్ముకోలేని సిచ్యువేషన్‌. శివమ్‌ మావి పర్లేదు. జడ్డూ బంతి, బ్యాటుతో రాణించేందుకు ప్రయత్నిస్తున్నాడు. బౌలింగ్‌, జట్టు కూర్పు పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీపక్ చాహర్‌ గాయపడ్డాడు. స్టోక్స్‌ బంతి పట్టుకోవడం లేదు. మొయిన్‌దీ ఇదే పరిస్థితి. మిచెల్‌ శాంట్నర్‌ ఒక్కడే అదరగొడుతున్నాడు. గాయాల దృష్ట్యా రాజస్థాన్‌పై ఎలాంటి టీమ్‌ను సెట్‌ చేస్తారనే సందేహాలు ఉన్నాయి.


చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, అంబటి రాయుడు, డ్వేన్ ప్రిటోరియస్, మహిష్ తీక్షణ ప్రశాంత్ సోలంకి, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, సిమర్‌జిత్ సింగగే , మిచెల్ సాంట్నర్, మతిషా పతిరనా, సుభ్రాంగ్షు సేనాపతి, తుషార్ దేశ్‌పాండే, బెన్ స్టోక్స్, భగత్ వర్మ, అజయ్ జాదవ్ మోండల్, కైల్ జేమీసన్, మొహమ్మద్.


రాజస్థాన్ రాయల్స్ జట్టు: సంజూ శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్ మయర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, రవి అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెద్ మెక్‌కాయ్, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, కేసీ కరియప్ప, జో రూట్, అబ్దుల్ పా, ఆకాష్ వశిష్ట్, మురుగన్ అశ్విన్, కెఎమ్ ఆసిఫ్, ఆడమ్ జంపా, కునాల్ రాథోడ్, డోనోవన్ ఫెరీరా.