IPL 2023, CSK vs MI:
చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్ టాస్ వేశారు. టాస్ గెలిచిన ఎంఎస్ ధోనీ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. వికెట్ బాగుందని తెఇపాడు. వర్షం వచ్చే అవకాశం ఉందని సూచించాడు. జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదన్నాడు.
'మేం మొదట బౌలింగ్ చేస్తాం. వర్షం వచ్చే అవకాశం ఉంది. అందుకే బౌలింగ్ ఎంచుకున్నాం. వికెట్ బాగుంది. వాళ్లు టార్గెట్ పెట్టాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు బాగా ఆడాలి. మైదానంలో ఇంటెంట్ చూపించాలి. ఆడే కొద్దీ మేం మెరుగవుతున్నాం. కొన్ని ఒడుదొడుకులు తప్పవు. ఏదేమైనా బాగా ఫినిష్ చేయాలి. జట్టులో మార్పులేమీ లేవు' అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అన్నాడు.
'బాగా ఆడుతున్నాం. వరుసగా మ్యాచులు గెలుస్తున్నాం. ఇదే మూమెంటమ్ కొనసాగించాలని అనుకుంటున్నాం. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ సానుకూలంగా ముందుకెళ్తున్నాం. సరైన సమయంలో సరైన కూర్పు ఎంచుకోవడం ముఖ్యం. ఎవరి బలం ఏంటో బాగా తెలుసు. రెండు మార్పులు చేశాం. కుమార్ కార్తికేయ ఆడటం లేదు. రాఘవ్ గోయెల్‌ను తీసుకున్నాం. తిలక్ వర్మకు కాస్త అస్వస్థతగా ఉండటంతో త్రిస్టన్ స్టబ్స్‌ను ఎంచుకున్నాం' అని ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, త్రిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, పియూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, ఆకాశ్ మధ్వాల్, అర్షద్ ఖాన్
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, అజింక్య రహానె, మొయిన్ అలీ, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, దీపక్ చాహర్, మతీశ పతిరన, తుషార్ దేశ్‌పాండే, మహీశ తీక్షణ
ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌ది విచిత్రమైన పరిస్థితి! బ్యాటర్లు బాగున్నా బౌలింగ్ బాగాలేదు. దాంతో ప్రత్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. రుతురాజ్ (Ruturaj Gaikwad) స్కోరింగ్ రేట్ తగ్గింది. డేవాన్ కాన్వేనూ త్వరగానే ఔట్ చేస్తున్నారు. వీరిద్దరూ మంచి ఓపెనింగ్ పాట్నర్‌షిప్ అందించాలి. అజింక్య రహానె (Ajinkya Rahane), శివమ్ దూబె ఫర్వాలేదు. రవీంద్ర జడేజా దూకుడుగా రన్స్ చేస్తున్నాడు. అయితే అంబటి రాయుడు, మొయిన్ అలీ చేసిందేమీ లేదు. మహీ వరకు బ్యాటింగే రావడం లేదు. వచ్చినా ఎప్పుడో ఒకసారి మెరుస్తున్నాడు. బెన్‌స్టోక్స్ వారం నుంచి బౌలింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్ ఆడతాడో లేదో తెలియదు. డెత్ ఓవర్లలో పతిరన ఆకట్టుకున్నాడు. దాంతో కోలుకున్నా సిసింద మగలకు చోటు దక్కకపోవచ్చు. తీక్షణ, జడ్డూ, అలీ స్పిన్ చూస్తున్నారు. దేశ్ పాండే రన్స్ లీక్ చేస్తున్నాడు. దీపక్ చాహర్ రావడం కాస్త ఊరట.