CSK vs LSG, IPL 2023:
చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ టాస్ వేశారు. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. 'మేం మొదట బౌలింగ్ చేస్తాం. ఛేజింగ్‌లో మేమెలా ఉన్నామో తెలుసుకుంటాం. దిల్లీ క్యాపిటల్స్‌పై మా ప్రదర్శన బాగుంది. అన్ని విభాగాల్లో రాణించాం. ఈ రోజు అంతకన్నా మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. జయ్‌దేవ్ ఉనద్కత్ ప్లేస్‌లో యశ్ ఠాకూర్ వచ్చాడు. చెపాక్ పరిస్థితులను వేగంగా అర్థం చేసుకొని సరైన లెంగ్తుల్లో బంతులు వేయాలి. బ్యాటర్లను త్వరగా ఔట్ చేయాలి. ఛేదనలో డ్యూ ఫ్యాక్టర్ ఉండొచ్చు' అని కేఎల్ అన్నాడు.
ఎంఎస్ ధోనీ ఎమోషనల్!
'చెపాక్‌లో మళ్లీ మ్యాచ్ ఆడటం ఎంతో బాగుంది. 2008లో ఐపీఎల్ మొదలైనా ఇక్కడ ఎక్కువ క్రికెటైతే ఆడలేదు. 5-6 సీజన్లే ఇక్కడ ఆడాం. మొత్తం స్టేడియం నిర్వహణలో ఉండటం ఇదే ఫస్ట్ టైమ్. గతంలో కొన్ని స్టాండ్స్ ఖాళీగా ఉండేవి. మా హోమ్ గ్రౌండ్ మ్యాచులన్నీ ఇక్కడే ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది. జట్టులో మార్పులేమీ చేయలేదు. పరిస్థితులకు తగ్గట్టుగా లక్ష్యాలు మార్చుకోవడం ముఖ్యం' అని ధోనీ అన్నాడు.
తుది జట్లు
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), కృష్ణప్ప గౌతమ్, మార్క్ వుడ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్
చెన్నై సూపర్ కింగ్స్: డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్
పిచ్ రిపోర్ట్
చెన్నైలోని ఎం చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇది చెన్నై సూపర్ కింగ్స్‌కు సొంత మైదానం. మరోవైపు ఇక్కడి పిచ్ గురించి మాట్లాడుకుంటే ఈ మైదానం పిచ్ చాలా స్లోగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ స్పిన్నర్లు కీలకం కానున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ శిబిరంలో స్పిన్నర్లు ఎక్కువగానే ఉన్నారు. అటువంటి పరిస్థితిలో వారి సొంత మైదానంలో వారిని ఓడించడం చాలా కష్టం.