IPL 2023 Closing Ceremony: ఈ ఏడాది మార్చి 31 న మొదలై దేశంలోని పలు నగరాల్లో క్రికెట్ అభిమానులను రెండు నెలల పాటు ఉర్రూతలూగిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 ఎడిషన్ ముగింపు దశకు చేరుకున్నది. ఈ లీగ్‌లో మిగిలున్నది ఒక్క మ్యాచ్ మాత్రమే. రెండో క్వాలిఫయర్‌లో ముంబైని చిత్తు చేసిన గుజరాత్.. మే 28 (ఆదివారం)న ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. గత సీజన్ మాదిరిగానే ముగింపు వేడుకలను ఘనంగా చేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది.
ఆడిపాడేది వీళ్లే...
గతేడాది అహ్మదాబాద్ వేదికగానే ఐపీఎల్ - 15 ఫైనల్ (గుజరాత్ - రాజస్తాన్) జరిగింది. ఫైనల్‌లో ఎఆర్ రెహ్మాన్ గానా భజానాతో పాటు ప్రముఖ భాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ నరేంద్ర మోడీ స్టేడియాన్ని హోరెత్తించారు. ఈ ఏడాది కూడా వాళ్లిద్దరూ వస్తున్నారని ప్రచారం జరిగినా దానిమీద బీసీసీఐ ఇప్పటివరకు స్పష్టతనివ్వలేదు. అయితే ఈసారి అహ్మదాబాద్ ప్టేడియంలో ఉండేవారితో పాటు టీవీలు, మొబైల్స్ ముందు ఫైనల్‌ను వీక్షించే కోటానుకోట్ల మందిని అలరించడానికి యువ సంగీత సంచలనాలు రాబోతున్నాయి. ప్రముఖ ర్యాపర్ వివయన్ డివిన్, న్యుక్లెయర్, కింగ్ తో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన జొనితా గాంధీ అభిమానులను అలరించనున్నారు.
ఈ మేరకు బీసీసీఐ కూడా ఐపీఎల్ అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘అహ్మదాబాద్.. ట్రీట్ కు రెడీగా ఉండు.. నరేంద్ర మోడీ స్టేడియంలో ముగింపు వేడుకలకు కింగ్, న్యుక్లెయ, జొనాతన్ గాంధీలు తమ ప్రదర్శనలతో అలరించనున్నారు..’అని ట్వీట్ చేసింది.
మిడ్ షో..
సాధారణంగా ఐపీఎల్‌లో ఓపెనింగ్, క్లోజింగ్ ఈవెంట్స్ అన్నీ మ్యాచ్‌లకు ముందు జరుగుతాయి. కానీ ఈసారి బీసీసీఐ స్టైల్ మార్చింది. మ్యాచ్‌కు ముందు 6.30 గంటలకు డివిన్, న్యుక్లెయర్‌ల ప్రదర్శన ఉండనుండగా.. కింగ్, జొనితా గాంధీలు ఒక ఇన్నింగ్స్ తర్వాత పర్ఫార్మ్ చేయనున్నారు. ఒక ఇన్నింగ్స్ ముగిశాక 20 నిమిషాల గ్యాప్ లో కింగ్, జొనాథన్ గాంధీల షో ఉండనుంది. దీంతో పాటు మ్యాచ్‌కు ముందు.. జరిగే క్రమంలో కూడా లైటింగ్ షో ఉండనుంది. ఈ మేరకు బీసీసీఐ నరేంద్ర మోడీ స్టేడియంలతో అన్ని ఏర్పాట్లూ చేసింది.
ఎవరు వీళ్లు..
- ‘గల్లీ ర్యాప్’ ద్వారా గుర్తింపు పొందిన డివిన్ పుట్టిపెరిగిందతా అంధేరి (ముంబై) లోనే. 2013 లో ‘యె మేరా ముంబై’ పాట ద్వారా వెలుగులోకి వచ్చిన డివిన్.. బాంబే రాప్ సైపర్, మేరే గల్లీ మే, జంగ్లీ షేర్, గల్లీ గ్యాంగ్ ద్వారా ఫేమస్ అయ్యాడు. రణ్వీర్ సింగ్ నటించిన గల్లీ బాయ్ సినిమాలో ‘అప్నా టైమ్ ఆయేగా’ పాట రాయడంతో పాటు ఈ పాట కంపోజర్ కూడా అతడే.
- అహ్మదాబాద్‌కే చెందిన న్యుక్లెయ పుట్టిపెరిగింది ఆగ్రాలో. అతడి పేరు ఉదయన్ సాగర్. ర్యాపర్ గా కెరీర్ ఆరంభించిన ఆయన.. తర్వాత సంగీత దర్శక్తవం వైపు మళ్లాడు. కపూర్ అండ్ సన్స్, హైజాక్, చోక్డ్ వంటి సినిమాలకు సంగీతం అందించాడు.
- ఉత్తరప్రదేశ్‌కు చెందిన కింగ్ (అర్పన్ కుమార్ చండెల్) బొంబాస్, సర్కమ్‌స్టాన్సెస్, జిందా వంటి ఆల్బమ్స్ తో ఫేమస్ అయ్యాడు.
- ఇక తెలుగు, తమిళ్ తో పాటు హిందీలో కూడా సూపర్ హిట్ సాంగ్స్ పాడిన జొనితా గాంధీ.. హలమిత్తి హబీబో (బీస్ట్), జిమికీ పొన్ను (వారసుడు), దేవా దేవా (బ్రహ్మస్త్ర) వంటి పాటలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే..