Brother who played in IPL: ఐపీఎల్‌లో ఆదివారం రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు డువాన్ జాన్సన్‌ను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంది. ఇంతకుముందు, డువాన్ జాన్సెన్ సోదరుడు మార్కో జాన్సెన్ కూడా ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. అయితే ఇప్పుడు మార్కో జాన్సన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
డువాన్ జాన్సెన్, మార్కో జాన్సెన్ IPLలో ఆడిన పదో అన్నదమ్ముల ద్వయం. ఈ జాబితాలో ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్‌లు నంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ ఐపీఎల్‌లో ఆడిన మొదటి సోదరుల జంట.
అదే సమయంలో ఈ జాబితాలో షాన్ మార్ష్, మిచెల్ మార్ష్ రెండవ స్థానంలో ఉన్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు మైక్ హస్సీ, డేవిడ్ హస్సీలు కూడా ఐపీఎల్‌లో ఆడారు. వీరు మాత్రమే కాకుండా దక్షిణాఫ్రికాకు చెందిన అల్బీ మోర్కెల్, మోర్నీ మోర్కెల్ ఉన్నారు.
ఈ జాబితాలో ఎవరు ఉన్నారు?
అయితే ఈ జాబితా ఇక్కడితో ఆగలేదు. ఈ జాబితాలో తర్వాతి పేరు వెస్టిండీస్‌కు చెందిన డ్వేన్ బ్రావో, డారెన్ బ్రావోలది. అదే సమయంలో భారత క్రికెటర్ సోదరులు సిద్ధార్థ్ కౌల్, ఉదయ్ కౌల్ కూడా ఉన్నారు.
ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్ రెచ్చిపోతోంది! తమదైన బ్యాటింగ్‌తో దుమ్మురేపుతోంది. పిచ్.. బౌలింగ్‌తో సంబంధం లేకుండా భారీ స్కోర్లు చేస్తూనే ఉంది. ఆదివారం వాంఖడేలో ముంబయి ఇండియన్స్‌కు ఏకంగా 186 టార్గెట్ సెట్ చేసింది. చిచ్చరపిడుగు.. పొడగరి.. వెంకటేశ్ అయ్యర్ (104; 51 బంతుల్లో 6x4, 9x6) ఇండియన్ ప్రీమియర్ లీగులో సరికొత్త మైలురాయి అందుకున్నాడు. తొలి సెంచరీ సాధించాడు. మెక్‌కలమ్ తర్వాత కేకేఆర్‌లో సెంచరీ కొట్టిన రెండో ఆటగాడిగా అవతరించాడు. ఆఖర్లో ఆండ్రీ రసెల్ (21;11 బంతుల్లో 3x4, 1x6) మెరిశాడు. హృతిక్ షోకీన్ 2 వికెట్లు పడగొట్టాడు.
మధ్యాహ్నం మ్యాచ్.. డ్రై పిచ్.. గ్రిప్ అవుతున్న బంతి! పరిస్థితులు బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేవు. కామెరాన్ గ్రీన్ వేసిన .15వ బంతికే ఓపెనర్ నారాయణ్ జగదీశన్ (0) ఔటయ్యాడు. మరో ఓపెనర్ రెహ్మనుల్లా గుర్బాజ్ (8) మరోసారి విఫలమయ్యాడు. అయినప్పటికీ పవర్ ప్లే ముగిసే సరికి కేకేఆర్ 52/2తో నిలిచిందంటే వెంకటేశ్ అయ్యర్ చలవే! ఆరంభంలోనే మోకాలికి బంతి తగిలి విలవిల్లాడిని అతడు.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పరుగెత్తడం కష్టం కావడంతో సిక్సర్లు, బౌండరీలు బాదడమే పనిగా పెట్టుకున్నాడు. జస్ట్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. రెండో వికెట్‌కు గుర్బాజ్‌తో కలిసి 22 బంతుల్లోనే 46 రన్స్ భాగస్వామ్యం అందించాడు. నితీశ్ రాణా (5) త్వరగానే డగౌట్‌కు చేరుకున్నాడు.
హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ఐపీఎల్ నుంచి మంచి పేరు సంపాదించుకున్నారు. ఇంగ్లండ్ క్రికెటర్ సోదరులు శామ్ కరన్, టామ్ కరన్ కూడా ఇప్పటికే ఐపీఎల్‌లో ఆడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి డువాన్ జాన్సెన్, మార్కో జాన్సెన్ కూడా చేరారు.