ఐపీఎల్‌లో శనివారం రాత్రి జరిగే మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ మొదట బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపింది. ఈ మ్యాచ్‌లో గెలుపు లక్నో కంటే కోల్‌కతా ఎక్కువ అవసరం. ఇక్కడ కూడా ఓడితే కోల్‌కతా ప్లే ఆఫ్ అవకాశాలు దెబ్బతింటాయి.
ఈ సీజన్‌లో లక్నో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడి ఏడు విజయాలు సాధించింది. 14 పాయింట్లతో టేబుల్‌లో రెండో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం వీరి టార్గెట్ టాప్-2లో నిలవడమే. ఇక కోల్‌కతా పరిస్థితి అలా కాదు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో వారు కచ్చితంగా గెలవాల్సిందే. లేకపోతే మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా అయితే సాగడం మాత్రం ఖాయం.
ఇక తుదిజట్లలో రెండు జట్లూ ఒక్కో మార్పు చేశాయి. లక్నో సూపర్ జెయింట్స్ కృష్ణప్ప గౌతం స్థానంలో అవేష్ ఖాన్‌ను జట్టులోకి తీసుకోగా... ఉమేష్ యాదవ్ గాయపడటంతో కోల్‌కతా హర్షిత్ రాణాకు తుదిజట్టులో చోటు కల్పించింది.
లక్నో సూపర్ జెయింట్స్ తుదిజట్టు
క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, అయుష్ బదోని, జేసన్ హోల్డర్, దుష్మంత చమీర, అవేష్ ఖాన్, మొహ్‌సిన్ ఖాన్, రవి బిష్ణోయ్
కోల్‌కతా నైట్‌రైడర్స్ తుదిజట్టు
బాబా ఇంద్రజిత్ (వికెట్ కీపర్), ఆరోన్ ఫించ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, ఆండ్రీ రసెల్, హర్షిత్ రాణా, టిమ్ సౌతీ, శివం మావి