ఐపీఎల్‌లో భిన్నంగా టైటిల్ సాధించిన జట్లు సీఎస్కే, దక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) క్లైమాక్స్‌కు చేరింది. లీగ్ దశలు పూర్తి కాగా, టాప్ 4 జట్లు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ ఆడనున్నాయి. టాప్ 2 లో ఉన్న జట్లు గుజరాత్, రాజస్థాన్ జట్లు నేడు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా క్వాలిఫయర్ 1 లో తలపడతాయి. విజేతగా నిలిచిన జట్టు ఫైనల్స్‌కు వెళ్తుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో మ్యాచ్ ఆడేందుకు అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ విజేత క్వాలిఫయర్ 2గా ఫైనల్ చేరుతుంది.


ఇప్పటివరకూ ఐపీఎల్ 14 సీజన్లు జరగగా.. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచిన జట్టు 5 పర్యాయాలు టైటిల్ విన్నర్‌గా నిలిచింది. 2వ స్థానంలో లీగ్ పూర్తి చేసిన టీమ్స్ సైతం 6 సార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గాయి. అంటే 14 సీజన్లలో 11 టైటిల్స్ నెగ్గిన జట్లు టాప్ 2 స్థానంతో లీగ్‌ను ముగించాయి. తొలి సీజన్‌లో పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్‌లో నిలిచిన రాజస్థాన్ ఐపీఎల్ తొలి టైటిల్ ఎగరేసుకుపోయింది. టాప్ 2లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు టైటిల్ విజేతగా నిలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి.


ఆ 3 జట్లు స్పెషల్..
లీగ్ స్టేజ్‌లో 3, 4 స్థానాల్లో నిలిచిన టీమ్స్ గత 14 సీజన్లలో కేవలం 3 సార్లు మాత్రమే నెగ్గాయి. ఆ మూడు జట్లు దక్కన్ ఛార్జర్స్, చెన్నై సూపర్ కింగ్స్,  ఐపీఎల్ 2వ సీజన్ 2009లో లీగ్ స్టేజీలో 4వ స్థానంలో ఉన్న దక్కర్ ఛార్జర్స్ టైటిల్ ఎగరేసుకుపోయి టాప్ 3 జట్లకు షాకచ్చింది. ఐపీఎల్ 3వ సీజన్ 2010లో సీఎస్కే టీమ్ తొలిసారి టైటిల్ విన్నర్ అయింది. ఆ సీజన్‌లో సీఎస్కే జట్టు లీగ్ స్టేజీని 3వ స్థానంతో ముగించింది. ఐపీఎల్ 9వ సీజన్ 2016లో లీగ్ స్టేజీని 3వ ప్లేస్‌లో ముగించిన సన్‌రైజర్స్ ఆ ఏడాది ఐపీఎల్ విజేతగా నిలిచి సత్తా చాటింది. ఈ ఏడాది లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీలు మూడు, నాలుగు స్థానాల్లో లీగ్‌ దశను కంప్లీట్ చేశాయి. 


సంవత్సరం - జట్లు (లీగ్‌లో పొజిషన్)
2008 - రాజస్థాన్ (1)
2009 - దక్కన్ ఛార్జర్స్ (4)
2010 - సీఎస్కే (3)
2011 - సీఎస్కే (1)
2012 - కేకేఆర్ (2)
2013 - ముంబై (2)
2014 - కేకేఆర్ (2)
2015 - ముంబై (2)
2016 - సన్‌రైజర్స్  (3)
2017 - ముంబై (1)
2018 - సీఎస్కే  (2)
2019 - ముంబై (1)
2020 - ముంబై (1)
2021 - సీఎస్కే  (2)


లీగ్‌ను 1వ స్థానంలో ముగించిన టీమ్ 5 టైటిల్స్ నెగ్గగా, 2 స్థానంలో ఉన్న టీమ్ 6 సార్లు కప్పు కొట్టింది. 3, 4 స్థానాల్లో నిలిచిన టీమ్స్ కేవలం 3 సార్లు మాత్రమే ఐపీఎల్ ట్రోఫీ సాధించాయి.


Also Read: IPL 2022, Qualifier 1 Preview: ఫైనల్స్ మొదటి బెర్త్ ఎవరిది? - టైటాన్స్, రాయల్స్ బలాబలాలు ఎలా ఉన్నాయి?